'నా పేరు శృతిహాసన్, సరిగా పలకండి' | I wish people would spell my name right, its SHRUTI HAASAN | Sakshi
Sakshi News home page

'నా పేరు శృతిహాసన్, సరిగా పలకండి'

Published Wed, Nov 18 2015 11:43 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

'నా పేరు శృతిహాసన్, సరిగా పలకండి' - Sakshi

'నా పేరు శృతిహాసన్, సరిగా పలకండి'

సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేసేస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్ను ఓ వింత సమస్య ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ పేరును చాలా మంది సరిగ్గా పలకటం లేదట. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన శృతి.. తన పేరుకు కరెక్ట్ స్పెలింగ్ ఏంటో చెప్పింది. 'ప్రజలు నా పేరును కరెక్ట్ గా పలకాలని కోరుతున్నా, నా పేరు శృతిహాసన్' అంటూ ట్వీట్ చేసింది ఈ బ్యూటీ. చాలామంది శ్రితి, స్తృధి, సురుధి, శ్రూతీ, హస్సన్ లేదా శ్రుతి హుస్సేన్ అని కూడా అంటున్నారంటూ బుంగమూతి పెట్టి వాపోయింది.


ఇటీవల అజిత్ సరసన హీరోయిన్ గా నటించిన వేదలం సినిమాతో సూపర్ హిట్ సాధించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం హిందీలో రెండు, తమిళంలో ఒకటి, తెలుగులో మూడు సినిమాలతో బిజీగా ఉంది. నటిగానే కాక సింగర్ కూడా తనసత్తా చాటుతున్న శృతీహాసన్ ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా టాప్ ప్లేస్ను ఎంజాయ్ చేస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement