
ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోహ్లి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూనే తన ఫిట్ నెస్ పై బాగా శ్రద్ద చూపిస్తుంటారు. ఆయన చేసే వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచకుంటాడు కూడా. ఇక తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకునే విరాట్ కోహ్లీ తాగే మంచినీటి బాటిల్ ఖరీదు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఎందుకంటారా..తాను బ్లాక్ వాటర్ తాగుతానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకోచ్చాడు. ఈ నీళ్ళలో హైడ్రేటెడ్‌గా ఉండడమే కాకుండా.. పీహెచ్ అధికంగా ఉంటుంది.
చదవండి: T20 World Cup 2021: ‘ఈసారి విజేత భారత్ కాదు.. ఆ జట్టే గెలుస్తుంది
సాధారణంగా మనం తాగే లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు.. రూ. 20 నుంచి ఆపై మరికాస్త ఖరీదు ఉండొచ్చు.. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర లీటరుకు రూ.3000 నుంచి రూ.4000 వరకు ఉంటుంది. ఈ నీళ్ళలో సహజసిద్ధమైన బ్లాక్ ఆల్కలీన్ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పీహెచ్(pH) ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లాక్ వాటర్ చర్మ నాణ్యతను మెరుగుపరచడంతో పాటు, బరువును కూడా అదుపులో ఉంచుతుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ తాగుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, శ్రుతిహాసన్ ఫిట్‌గా ఉండేందుకు బ్లాక్ వాటర్ తాగుతున్నారు.
చదవండి: సచిన్‌లో ఆ బలహీనత గమనించా.. దిగ్గజ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment