‘ఆకాశం అమ్మాౖయెయితే, నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..’ఆ అమ్మాయి ఎవరో ఈ పాటికే మీకు తెలిసిపోయే ఉంటుంది! మరి, అంతటి అందంతో పోటీపడేందుకు నిచ్చెన వేస్తున్న ఆ ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
దేవనాగ్రి..
ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్తు ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజనీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. తర్వాత దేశమంతటా వివిధ పండుగలకు తగ్గ దుస్తులను డిజైన్ చేయటం మొదలుపెట్టారు.
కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగ్రి’అనే ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించారు. భారతదేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్ దుస్తుల్లో మెరిశారు. స్పెషల్ అకేషన్స్‌కు సరిపోయే డిజైన్స్ రూపొందించడంలోనూ వీరు సిద్ధ హస్తులు. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి.
చీర.. బ్రాండ్:
దేవనాగ్రి ధర: రూ. 34,000
అమ్రపాలి జ్యూయెలరీ
నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్‌లో ‘అమ్రపాలి’ పేరుతో మ్యూజియం స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘అమ్రపాలి జ్యూయెలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లో కూడా అమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
జ్యూయెలరీ బ్రాండ్:
అమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
చదవండి: ఇవి తింటే బట్టతల ఖాయం..! గుడ్డు తెల్లసొన, చేప, చక్కెర..
Comments
Please login to add a commentAdd a comment