శ్రుతీహాసన్, అక్షరాహాసన్, శ్రీదేవి
ఇక్కడున్న ఫొటోలను గమనించారా? ఎవరో కనిపెట్టేశారా? ప్చ్.. లేదు అంటున్నారా? అయితే.. క్లూ ఇదిగో. ఒక ఫొటోలో ఇద్దరు ఉన్నారు కదా.. ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఇంకో ఫొటోలో నల్ల ప్యాక్ వేసుకుంది చూశారూ.. ఆ అమ్మాయి మన అతిలోక సుందరి శ్రీదేవికి బంధువు అవుతుంది. బాలీవుడ్ అన్నమాట. మిల్క్‌లాంటి ప్యాక్ వేసుకున్న అమ్మాయి ఎవరనే క్లూ ఇవ్వక్కర్లేదేమో. ఈ క్లూస్‌తో ప్యాక్ బ్యాక్ ఉన్న ముఖారవిందం ఎవరిదో కనిపెట్టేసి ఉంటారు కదూ. తెలుసుకోలేనివాళ్ల కోసం పేర్లు చెప్పేస్తున్నాం... చెప్పేస్తున్నాం... చెప్పేస్తున్నాం.
ఆ అక్కాచెల్లెళ్లు ఎవరో కాదు.. లోకనాయకుడు కమల్‌హాసన్ కుమార్తెలు శ్రుతీహాసన్, అక్షరాహాసన్. శ్రీదేవి బంధువు అంటే.. సోనమ్ కపూర్. శ్రీదేవి భర్త బోనీకపూర్ తమ్ముడు అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ అనే విషయం తెలిసిందే. మిల్క్‌లాంటి ప్యాక్ వేసుకున్నది ఎవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. ముఖారవిందం మిలమిలా మెరిసే ముందు ఆ ముఖం కనిపించకుండా ఇలా ‘ఫేస్‌ప్యాక్’ వేసుకుంటారన్న మాట.
Comments
Please login to add a commentAdd a comment