'రక్షక్'గా రామ్చరణ్...? | ram charan next movie title rakshak | Sakshi
Sakshi News home page

'రక్షక్'గా రామ్చరణ్...?

Dec 11 2015 4:16 PM | Updated on Sep 3 2017 1:50 PM

'రక్షక్'గా రామ్చరణ్...?

'రక్షక్'గా రామ్చరణ్...?

'బ్రూస్ లీ' ఫెయిల్యూర్తో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రామ్ చరణ్ తిరిగి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు.

'బ్రూస్ లీ' ఫెయిల్యూర్తో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రామ్ చరణ్ తిరిగి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ సినిమా 'తనీ ఒరువన్'ను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటిచిన మెగా వారసుడు. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ కూడా ఫైనల్ చేసిన చెర్రీ ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ఇతర విషయాల మీద దృష్టి పెట్టాడు.

అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాకు కీలకమైన విలన్ పాత్రకు చాలా మంది పేర్లు పరిశీలించినా ఫైనల్ గా ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామితోనే ఆ పాత్ర చేయించాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'రక్షక్' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement