rakshak
-
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
రక్షణం.. ఇక తక్షణం!
* రక్షక్‌లకు ‘రెస్పాన్స్ టైమ్’.. నగరంలో అమలు * ‘డయల్ 100’తో పెట్రోలింగ్ వ్యవస్థ అనుసంధానం * జీపీఎస్‌తో ‘తెరపైకి’ అన్ని గస్తీ వాహనాలు * గొడవలు జరిగినా, ప్రమాదం సంభవించినా తక్షణమే ఘటనాస్థలికి.. సాక్షి, హైదరాబాద్: గస్తీ విధానంలో జవాబుదారీతనం పెంచడం.. వీలైనంత త్వరగా ఘటనాస్థలికి చేరుకోవడం.. నేరాలు జరిగే ప్రాంతాల్లోనే పెట్రోలింగ్ ఉండేలా చూడటం.. ఇవే ప్రధాన ఎజెండాగా రక్షక్‌లకు ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ నిర్ధారించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న గస్తీ వాహనాలను ‘డయల్-100’తో అనుసంధానించారు. ఈ అత్యాధునిక జీపీఎస్ ఆధారిత విధానం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి ఠాణాకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వో) సైతం తమ గస్తీ వాహనాల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకునేలా చర్యలు తీసుకున్నారు. దీని అమలు కోసం కమిషనరేట్‌లోని ప్రతి గస్తీ వాహనానికీ ఓ ట్యాబ్ అందించారు. ఈ తరహాలో ‘డయల్-100’ను రక్షక్లతో అనుసంధానించి, యాప్ రూపంలో ట్యాబ్‌ల్లోకి చేర్చడం దేశంలోనే తొలిసారి. ఈ అత్యాధునిక విధానం ఎలా పనిచేస్తుందన్న అంశంపై కథనం... 1. తెరపై కనిపించే ‘రక్షక్’లు.. బాధితులు ‘100’కు ఫోన్ చేసి సహాయం కోరిన వెంటనే సిబ్బంది.. బాధితుడు ఉన్న ప్రాంతాన్ని అడిగి తెలుసుకుంటారు. గస్తీ వాహనాలను జీపీఎస్‌తో అనుసంధానిస్తున్న నేపథ్యంలో ‘100’ సిబ్బందికి ఏ వాహనం ఎక్కడుందో కంప్యూటర్ తెరపై కచ్చితంగా తెలుస్తుంది. దీంతో బాధితుని కాల్‌ను అతనికి సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనానికి డైవర్ట్ చేస్తారు. వాహనంలోని సిబ్బందికి ‘100’ నుంచి డైవర్డ్ అయిన కాల్ వస్తే.. ప్రత్యేక రింగ్‌టోన్ ద్వారా ట్యాబ్‌లో రింగ్ వస్తుంది. ఫోన్ ఎత్తిన వెంటనే ట్యాబ్ తెరపై ఓ నోటిఫికేషన్ ప్రత్యక్షమవుతుంది. అందులో బాధితునికి సంబంధించిన అంశాలు, ఫిర్యాదు ఏమిటన్నవి కనిపిస్తాయి. గస్తీ వాహనంలోని సిబ్బంది ‘రిసీవ్డ్’ అనే బటన్ నొక్కడం ద్వారా ఫిర్యాదు అందుకున్నట్లు ఎక్నాలెడ్జ్ చేయాలి. 2. ‘నొక్కితే’ టైమ్ మొదలైనట్లే.. ఎక్నాలెడ్జ్ చేసినప్పటి నుంచి ‘రెస్పాన్స్ టైమ్’ ప్రారంభమవుతుంది. వెంటనే ఘటనాస్థలికి చేరుకునే వాహనాలు ఫిర్యాదు తీరును బట్టి అవసరమైన రీతిలో స్పందిస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగినట్లైతే క్షతగాత్రులకు అవసరమైన సహాయం అందించడంతో పాటు ఆధారాల కోసం ఫొటోలు తీస్తారు. పబ్లిక్ ప్లేసుల్లో గొడవలు, ఇతర నేరాలకు సంబంధించిన ఫిర్యాదైతే స్థానిక పోలీసుల్ని అప్రతమత్తం చేసి.. ఘటనాస్థలాల్ని వీడియోలో చిత్రీకరించి తదుపరి చర్యలు తీసుకుంటారు. సహాయక చర్యలు పూర్తయిన వెంటనే సదరు ఫొటోలు, వీడియోలను రక్షక్ సిబ్బంది ఆన్లైన్ ద్వారా సంబంధిత ఎస్‌హెచ్‌వోకు పంపిస్తారు. ఈ తతంగం పూర్తయిన తర్వాత తొలుత వచ్చిన నోటిఫికేషన్‌ను మళ్లీ ఓపెన్ చేయాలి. అందులో ఉండే ‘కాల్ క్లోజ్’ బటన్ నొక్కడంతో ‘రెస్పాన్స్ టైమ్’ పూర్తవుతుంది. ఈ బాధ్యతను ఎస్హెచ్వోకే అప్పగించారు. కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది ప్రతి ఉదంతానికి సంబంధించి గస్తీ వాహనాలు ‘రిసీవ్డ్’ బటన్ నొక్కడానికీ, ‘కాల్ క్లోజ్డ్’ బటన్ నొక్కడానికి మధ్య కాలాన్ని లెక్కిస్తారు. 3. ఇలా పర్యవేక్షిస్తారు ప్రతి డివిజన్, జోన్ వారీగా ఎన్ని కాల్స్ వచ్చాయి? ఎన్ని క్లోజ్ అయ్యాయి? ఎంత సమయం పట్టింది? అనే అంశాలను నిత్యం ఉన్నతాధికారులు ‘డాష్‌బోర్డ్’ ద్వారా పర్యవేక్షించే అవకాశం ఉంది. ఇలా ఏ వాహనానికి ఆ వాహనం ‘రెస్పాన్స్ టైమ్’తో పాటు నగర వ్యాప్తంగా అన్ని వాహనాల సరాసరినీ తీసుకుని ‘హైదరాబాద్ రెస్పాన్స్ టైమ్’ను నిర్ధారిస్తారు. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత మెరుగైన సేవలు అందిస్తున్నట్లు లెక్క. టైమ్ ఎక్కువ తీసుకున్న వాహనాల్లోని సిబ్బంది నుంచి ఆలస్యానికి కారణం తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటారు. -
చరణ్ టైటిల్ రక్షక్ కాదు ధ్రువ..?
బ్రూస్ లీ సినిమా ఫెయిల్యూర్‌తో డీలాపడ్డ చరణ్... నెమ్మదిగా తన నెక్ట్స్ సినిమాను సెట్స్ మీదకు తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ తనీఒరువన్ను రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించిన చెర్రీ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను చేయనున్నాడు. ఇప్పటికే కథా కథనాలను సిద్ధం చేసిన దర్శకుడు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమా టైటిల్‌పై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. పూర్తి సీరియస్ మూడ్‌లో సాగే ఈ సినిమాకు టైటిల్ కూడా అలాగే ఉండాలన్న ఆలోచనతో ముందుగా రక్షక్ అనే టైటిల్‌ను పరీశీలించారు. అయితే అభిమానుల నుంచి భిన్న స్పందనలు రావటంతో, తాజాగా ఈ సినిమా కోసం ధ్రువ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. యూనిట్ సభ్యుల నుంచి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా అభిమానులు మాత్రం ఈ టైటిల్‌పై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. -
'రక్షక్’గా రామ్‌చరణ్..?
-
'రక్షక్'గా రామ్‌చరణ్...?
'బ్రూస్ లీ' ఫెయిల్యూర్‌తో కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రామ్ చరణ్ తిరిగి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే తమిళ సూపర్ హిట్ సినిమా 'తనీ ఒరువన్'ను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటిచిన మెగా వారసుడు. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ కూడా ఫైనల్ చేసిన చెర్రీ ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ఇతర విషయాల మీద దృష్టి పెట్టాడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇక సినిమాకు కీలకమైన విలన్ పాత్రకు చాలా మంది పేర్లు పరిశీలించినా ఫైనల్ గా ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామితోనే ఆ పాత్ర చేయించాలని నిర్ణయించుకున్నారట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు 'రక్షక్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.