
సాక్షి, హైదరాబాద్ : సైరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా ప్రసారం చేసినందుకు గాను చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సాక్షి మీడియాకి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ‘ సాక్షి’ అద్భుత కవరేజీ ఇచ్చిందని ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం సైరా. తొలి స్వతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.తాజాగా ఈ మూవీ సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ చిత్రం తెలుగు, తమిళ, మళయాల, కన్నడ హిందీ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment