
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 450 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఆలోగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావనే ఉద్దేశంతో సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట.
ముందుగా అనుకున్నట్టుగా జనవరి 26న కాకుండా ఏప్రిల్ 13న 2.ఓ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే రజనీ వదిలేసిన డేట్ కు కమల్ రావాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడేళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన విశ్వరూపం 2 సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. మరో వారం రోజుల షూటింగ్ తో పాటు కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ పనులన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ కు రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారు కమల్ టీం.
Comments
Please login to add a commentAdd a comment