viswaroopam
-
ప్రభాస్‌దే అసలైన సక్సెస్.. కమల్‌తో పాత వీడియో వైరల్
డార్లింగ్ ప్రభాస్.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. కానీ ఇలాంటి ట్రెండ్ ఏం లేనప్పుడే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి వాళ్లు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ల ముగ్గురు కలిసి 'ప్రాజెక్ట్ K' అనే చిత్రం చేస్తున్నారు. ఇదంతా పక్కనబెడితే ప్రభాస్-కమల్ హాసన్ తో మాట్లాడిన పదేళ్ల క్రితం నాటి వీడియో ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: 'ప్రాజెక్ట్ K'లో కమల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) సక్సెస్‌కి కేరాఫ్ ప్రభాస్! 'బాహుబలి' ముందు ప్రభాస్ గురించి తెలుగులో మాత్రమే తెలుసు. అలా 2013లో కమల్ హాసన్ 'విశ్వరూపం' సినిమా సక్సెస్ మీట్ కు హాజరయ్యాడు. విలక్షణ నటుడు కమల్ కు తనని తాను ప్రభాస్ అని పరిచయం చేసుకున్నాడు. కట్ చేస్తే.. పదేళ్లలో ఏకంగా ఆయనతోనే 'ప్రాజెక్ట్ K'లో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేశాడు. ఆ వీడియోని చూస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.. ఇది కదా అసలైన సక్సెస్ అంటే అని తెగ పొగిడేస్తున్నారు. ప్రభాస్ మాట్లాడింది ఇదే 'ఆయన(కమల్ హాసన్) సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన పక్కన కూర్చోవడమే నా అదృష్టం. ఆయనకు నేనెవరో తెలియదేమో. ఐ యామ్ ప్రభాస్ సర్. మా జనరేషనే కాదు ఇంకో 10 జనరేషన్లకు కమల్ హాసన్ అవసరం. కమల్ హాసన్ గారికి సినిమాలు ఎంతో అవసరమో తెలియదు గానీ ఇండియాకు ఆయన సినిమాలు చాలా అవసరం' అని ప్రభాస్ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. aayana cinema lu chusthune periganu, aayana pakkana kurchovadame na adrustam.. aayanaki nen ewaro telidemo "I'm Prabhas Sir". 🙏 pic.twitter.com/4c2PN09XFq — ︎︎︎︎︎︎︎︎ ︎︎︎︎︎︎︎Telugu Tonic (@TeluguTonic) April 30, 2020 View this post on Instagram A post shared by Prabhas (@actorprabhas) (ఇదీ చదవండి: ఓటీటీలోకి మన సూపర్‌హీరో మూవీ.. తెలుగులోనూ!) -
సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్ సినిమాలను మాత్రం పక్కన పెట్టలేదు. త్వరలో నటనకు గుడ్‌బై చెపుతున్నట్టుగా ప్రకటించిన లోకనాయకుడు తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నాడు. కమల్ ఎన్నో కష్టనష్టాలకోర్చి తెరకెక్కించిన సినిమా విశ్వరూపం 2. ముందు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా ఈ సినిమాను ప్రారంభించారు. కానీ తరువాత రవిచంద్రన్ తప్పుకోవటంతో కమలే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు. కమల్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన విశ్వరూపం 2 ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
రజనీ వెనుకడుగు.. కమల్ రెడీ..!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 2.ఓ. గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 450 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రతి నాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను 2018 జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఆలోగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కావనే ఉద్దేశంతో సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట. ముందుగా అనుకున్నట్టుగా జనవరి 26న కాకుండా ఏప్రిల్ 13న 2.ఓ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే రజనీ వదిలేసిన డేట్ కు కమల్ రావాలని నిర్ణయించుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు మూడేళ్లుగా ల్యాబ్ కే పరిమితమైన విశ్వరూపం 2 సినిమాను జనవరి 26న రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. మరో వారం రోజుల షూటింగ్ తో పాటు కొంత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఆ పనులన్నీ పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ కు రెడీ చేసే ప్లాన్ లో ఉన్నారు కమల్ టీం. -
'విశ్వరూపం 2' ఏమైంది..?
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా విశ్వరూపం. కమల్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా రూపొందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు కావస్తున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదంటున్నాయి చెన్నై సినీ వర్గాలు. తొలి భాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కించాడు ఆస్కార్ రవిచంద్రన్. ఇలోగా రవిచంద్రన్ వేరే సినిమాలు నిర్మించటం, అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దీంతో విశ్వరూపం 2 పనులు ఆగిపోయాయి. షూటింగ్ పూర్తయినా, విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 25 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం, ఇప్పట్లో అంత బడ్జెట్ పెట్టడం కుదరదనుకున్న చిత్రయూనిట్ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారట. -
అంతకు ముందు ఆత్రేయగారు రాసిన సందర్భం కావడంతో ఛాలెంజ్‌గా తీసుకున్నా..!
రామజోగయ్యశాస్త్రి స్వరానికి మాటలు జోడించినంత మాత్రాన అది పాట అయిపోదు. సందర్భానికి తగ్గ భావవ్యక్తీకరణ ఉండాలి. గుండె లోతుల్లో నుంచి కవితావేశం ఉప్పొంగాలి. నిజమైన పాట అప్పుడు ఉద్భవిస్తుంది. దాంతో కవికి కావాల్సినంత ఆత్మసంతృప్తి. అయితే.. ప్రస్తుతం అలాంటి పాటలు అరుదైపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా భుక్తి కోసం రాసే పాటలే. ఈ పరిస్థితుల్లో కూడా అడపాదడపా తన పాటలతో తళుక్కున మెరుస్తుంటారు రచయిత రామజోగయ్యశాస్త్రి. ఆలోచింపజేసే సాహిత్యంతో, అందమైన పద సరళితో శ్రోతలను రంజింపజేస్తున్నారాయన. దాదాపు అన్ని రకాల పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రికి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన పాటలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోగాల్లో మచ్చుకు ఓ అయిదింటి గురించి ఆయన మాటల్లోనే... ‘శుభప్రదం’ - సినిమాలో ‘తప్పట్లో తాళాలోయ్’ అనే పాట రాశాను. విద్యాసాగర్ స్వరరచన చేసిన పాట అది. కె.విశ్వనాథ్‌గారి సినిమాకు పాట రాయడం అదే ప్రథమం. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుని ఆలోచించడం మొదలుపెట్టాను. అప్పుడు వెలిగింది... కథానుగుణంగా కృష్ణాష్టమి సందర్భంగా ఈ పాట వస్తుంది. ఈ పాట రాయమంది కె.విశ్వనాథ్‌గారు. సో... ఇది శివకేశవ ప్రేరేపితంగా భావించా. ఇప్పటికే శివకేశవులపై చాలా పాటలొచ్చాయి. అయితే... వైష్ణవావతారమైన కృష్ణుడితో శివుణ్ణి పోలుస్తూ పాట రాలేదు. ఎందుకో తెలీదుకానీ... శివుడికీ, కృష్ణుడికీ మధ్య పోలికలు కనిపించాయి నాకు. శివుడి మూడోకన్నే... నెమలికన్నుగా కృష్ణుని ఆభరణమైంది. శివుని ఓంకార నాదమే... కృష్ణుని మురళీనాదమైంది. భవుని విభూతే... బృందావనంలోని పుప్పొడిగా మారింది. ప్రమథగణ పూజితుడైన విరాగి శివుడైతే... యదుకాంతల ప్రేమను గెలిచిన విరాళి కృష్ణుడు. కైలాస నాట్యకేళి శివుడిదైతే... కాళింది పడగపై ఆనంద నాట్యహేళి కృష్ణుడిది. నాకు కనిపించిన ఈ పోలికలనే పాటగా మలిచాను. ‘తలపైన కన్నున్న ముక్కంటి తానేగా... శివమూర్తి శిఖిపించె మౌళీ... ప్రాణాలు వెలిగించు ప్రణవార్థమేగా... తన మోవి మురళీ స్వరాళీ... భవుని మేని ధూళి... తలపించదా వన మధూళీ... ప్రమథగణ విరాగి... యదుకాంతలకు ప్రియ విరాళీ... ఝణన ఝణన ఝన పద యుగళమే... జతపడే శివకేశవాభేద కేళీ... ఈ పోలిక చూసి... విశ్వనాథ్‌గారు ఎంతో సంతోషించారు. ‘విశ్వరూపం’ - కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ సినిమాలో ‘అణువినాశ వర్షమిదీ...’ నేను రాసిన పాటల్లో చెప్పుకోదగ్గ పాట. న్యూక్లియర్ బాంబు వినాశనం కారణంగా ప్రపంచం రెండు వర్గాలుగా మారి యుద్ధాలు మొదలయ్యాయి. టైజం పడగ విప్పింది. ప్రపంచం అశాంతికి లోనైంది.. ఈ పరిణామాలవల్ల మనకు ఒరిగిందేమింటి? అని ప్రశ్నించే పాట ఇది. తమిళ మాతృకను అక్కడి ప్రసిద్ధ సినీ గీతరచయిత వైరముత్తు రాశారు. ఆయన భావవ్యక్తీకరణ అద్భుతం. నాకు తెగ నచ్చేసింది. ఇది మాంటేజ్ సాంగ్ కావడంతో దాన్ని చక్కని తెలుగు పదబంధాలతో రాయొచ్చు. అందుకే... భావం చెడకుండా... అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా రాశాను. వైరముత్తు స్థాయిలో రాయలేకపోయినా... అందులో కొంత స్థాయికైనా చేరాననే ఆనందం ఉంది. ఇక ఆ పాటలో ఓ చరణం ఇది... అణువినాశ వర్షమిదీ... చితుల చిగురు మొలచినదీ. ఒక తల్లి కన్న కొడుకేగా సైనికుడెవరైనా... కాలేది కన్న కడుపేగా... ఎవ్వరు బలి అయినా... ఈ పెనుదాహం... కోరేదేమిటో... రణ... మారణహోమం.... ఆగేదెప్పుడో... ఎన్నడో... ఈ జన్మకు ఈ దేహం... మరుజన్మకు నీదే దేశం? నిరంతరమై నీ వెంటే... ఏదీ రాదు నేస్తం... క్షణికపు నీ ఆవేశం సాధించేది శూన్యం../ఈ పెనుదాహం కోరేదేమిటో... రణ... మారణహోమం ఆగేదెప్పుడో... ఎన్నడో... కమల్‌హాసన్‌గారు ఈ పాట విని చాలా సంతోషించారు. పైగా ఈ పాట స్వయంగా ఆయనే పాడారు. నా పాట ఆయన నోట వింటుంటే.. చెప్పలేనంత ఆనందం కలిగింది. అంతకుముందే, ‘మన్మథబాణం’ సినిమాకు కమల్‌గారికి రాశాను. నా కష్టం చూసే ‘విశ్వరూపం’కి అవకాశం ఇచ్చారాయన. ‘జులాయి’ - యువతరానికి సందేశాన్నీ, జోష్నీ ఇస్తూ నేను రాసిన పాట ‘పకడో పకడో...’. ‘జులాయి’ సినిమాలోని ఈ పాట నాకు మంచి పేరు తెచ్చింది. ఇది నా కెరీర్లో ముఖ్యమైన పాట. ముందు ఈ పాట ఒకే చరణం. హీరో పాత్రచిత్రణను ప్రతిబింబించేలా రాశాను. బాగుండటంతో ఇంకో రెండు చరణాలు రాయమన్నారు త్రివిక్రమ్. మిగిలిన రెండు చరణాలు నేటి యువతను లక్ష్యంగా చేసుకొని, వాళ్లకు ప్రేరణ కలిగించేలా రాశాను. నిన్న నువ్వు మిస్సయ్యింది పకడో... రేపు నీకు ప్లస్సయ్యేది పకడో.. ఒంటరైన జీరో.. వేల్యులేనిదేరో... దాని పక్క అంకెయ్రో... గెలుపను మేటరుంది ఎక్కడో... దాన్ని గెలిచే... రూట్ పకడో... టాలెంటుంది నీలో... ఖుల్లమ్ ఖుల్ల ఖేలో.. బ్యాటు బంతి నువ్వేరో... చెదరని ఫోకస్సే... సీక్రెటాఫ్ సక్సెసై... అర్జునుడి విల్లువై... యారో మారో యాపిల్ పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో పకడో... పకడో పకడో... నాలుగు మంచి మాటలు చెబితే బావుంటుందనే స్ఫూర్తితో రాసిన పాట ఇది. త్రివిక్రమ్‌కి కూడా బాగా నచ్చిన పాట. ‘రాజుభాయ్’ - సినిమాలో ఓ పాట రాశాను. కెరీర్ ప్రారంభంలో నాకు సంతృప్తినిచ్చిన పాట అది. ‘నువ్వు డేంజర్ జోన్లోకి అడుగుపెడుతున్నావ్’ అని హీరోని హెచ్చరించే పాట అది. సగటు మనిషికి కూడా ఉపయోగ పడే తత్వంతో ఈ పాట రాశాను. లోతే తెలియనిదే ఏటిలోన దిగకురా... గింజలు ఎరవేస్తే పంజరాన పడకురా.. కోసే కొడవలికి కొయ్యడమే తెలుసురా... వేసే అడుగు నీవు ఆచితూచి వేయరా... సాలె గూడు గూడు కాదు, పాము పడగ నీడ కాదు... సందర్భమే ఈ పాటకు ప్రేరణ. కథను ముందుకు నడిపించే ఇలాంటి పాట కూడా ఒకటి రాయగలిగాను అని గర్వంగా ఫీలవుతుంటా. ‘శిరిడిసాయి’ - బాబా అవతార ధర్మాన్ని ప్రతిబించేలా ‘షిరిడీసాయి’ సినిమా కోసం నేను రాసిన పాట ‘నీ పదమున ప్రభవించిన గంగా యమునా’. ఒక సాయిభక్తునిగా నాకు అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించిన పాట ఇది. గంగా, యమునా సంగమాన్ని చూడాలని ప్రయాగ బయలుదేరిన దాసగణుని బాబా కటాక్షించిన సన్నివేశం అది. పైగా ఈ సందర్భంలో ఆత్రేయగారు పాట రాసి ఉన్నారు. అదే సందర్భానికి ఇప్పుడు నేను రాయడం ఛాలెంజ్‌తో కూడుకున్న విషయం. ‘షిరిడీసాయిబాబా మహత్మ్యం’లో ‘సాయి శరణం... బాబా శరణు శరణం’ పాటంటే కె.రాఘవేంద్రరావుగారికి చాలా ఇష్టం. ఆ ఫ్లేవర్లోనే పాట రాయమన్నారు. నీ పదమున ప్రభవించిన గంగా యమునా... నా పాలిట ప్రసరించిన ప్రేమా కరుణా... ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా... ఏ జీవమైన భావమైన నీవేగా... నీవులేని చోటు లేదు సాయి... ఈ జగమే నీ ద్వారకామాయి భగవంతుణ్ణి సర్వాంతర్యామి అంటారు. షిరిడీసాయి ద్వారకామాయి నివాసి. అందుకే... జగమంతా ద్వారకామాయి అని రాశాను. షిరిడీసాయి యద్భావం తద్భవతీ అన్నారు. ఆయన ఆరడుగుల దేహం కాదు. భక్తుల అనుభూతికి ఆకృతి. ఆ భావమే ఈ పాటకు రూపమైంది. ఈ అయిదు పాటలే కాదు.. ఓ కవికి తాను రాసిన ప్రతి పాట తన బిడ్డే. అయితే... తల్లితండ్రులకు ఆత్మానందాన్ని కలిగించే బిడ్డలు మాత్రం కొందరే ఉంటారు. నాకు అలాంటి బిడ్డలే ఈ అయిదు పాటలు. -
పదునులేని ‘కత్తెర’కే పట్టమా?
ఇందిరాగాంధీ హయాంలో చలనచిత్ర సెన్సార్షిప్ విధానాన్ని సమీక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జీడీ ఖోస్లా అధ్యక్షతన కమిటీ (1969)ని నియమించారు. ముద్గల్ కమిటీ సిఫారసులతో పోలిస్తే, ఖోస్లా సిఫారసులే ఆధునికంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు పొందిన ఖోస్లా సిఫారసులను ఎవరూ పట్టించుకోలేదు. సినిమా అత్యంత ప్రభావవంతమైన మాధ్యమం. నూరు వసంతాల భారత చలనచిత్ర సీమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ, అరవై ఏళ్ల ‘సినిమాటోగ్రఫీ చట్టం-1952’ మాత్రం ఇంగ్లిష్ వాసనతో అలాగే ఉంది. ‘విశ్వరూపం’ చిత్ర వివాదంతో మేల్కొన్న కేంద్రం సినిమా చట్టానికి సంబంధించిన అన్ని అంశాలనూ అధ్యయనం చేయడానికి విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికతో పాటు, సినిమాటోగ్రఫీ బిల్లు 2013ను కూడా ఇటీవలే అందచేసింది. చలన చిత్ర సెన్సార్ వ్యవస్థ మీద ప్రభుత్వ పట్టును మరింత బిగించడానికి వీలు కల్పించే పలు ప్రతిపాదనలు చేసినట్టు విమర్శలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డ్ ఓ కీలుబొమ్మ ప్రస్తుతం సెన్సార్ బోర్డ్, చలనచిత్ర అప్పీలు ట్రిబ్యునల్ చైర్మన్లు,సభ్యుల నియామకాల మీద కేంద్రానిదే ఏకఛత్రాధిపత్యం. అస్మదీయులనీ, రాజకీయ నేపథ్యం ఉన్నవారినీ సెన్సార్ బోర్డ్ సలహా సంఘం సభ్యులుగా నియమించడం అలవాటుగా మారింది. రాజకీయ నియామకాల వల్ల ఏ అర్హతా లేని వారు సయితం సెన్సార్‌బోర్డ్ సభ్యులైపోతున్నారన్న విమర్శ ఉంది. సెన్సారింగ్ ప్రక్రియ పదును తగ్గడానికి కారణం ఇదేనని సెన్సార్‌బోర్డ్ ప్రస్తుత చైర్ పర్సన్ లీలా శాంసన్ వ్యాఖ్యానించారంటేనే పరిస్థితి అర్థమవుతుంది. నిజానికి ఈ సభ్యుల ఎంపికకు సంబంధించి కళలు, సినిమా, నాటకరంగం, న్యాయశాస్త్రం వంటి రంగాల వారిని గురించి కమిటీ సూచించినప్పటికీ, అర్హతలేవీ ప్రతిపాదించలేదు. సరిగ్గా ఈ నియామక ప్రక్రియనే కొత్త కమిటీ కొనసాగించినట్టయింది. సెన్సార్‌బోర్డ్ నిర్ణయాల మీద అప్పీలుకు వెళ్లే అవకాశం ప్రస్తుతం నిర్మాతకే ఉంది. దీనికి భిన్నంగా ట్రిబ్యునల్ అధికార పరిధిని విస్తరించి సెన్సార్‌బోర్డ్ నిర్ణయాల మీద ఎవరైనా అప్పీలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని కమిటీ చేసిన ప్రతిపాదన ఆహ్వానించదగినదే. కానీ, చట్టబద్ధంగా ఏర్పడిన సెన్సార్‌బోర్డ్ నిర్ణయాల మీద ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న సమాంతర పునర్ విచారణ అధికారాలను కమిటీ తొలగించకపోవడం ఆశ్చర్యమే. ఈ విశేష అధికారాల కొనసాగింపు కేఏ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధం కూడా. ఖోస్లా కమిటీ నివేదిక ఇందిరాగాంధీ హయాంలో చలనచిత్ర సెన్సార్షిప్ విధానాన్ని సమీక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జీడీ ఖోస్లా అధ్యక్షతన కమిటీ (1969)ని నియమించారు. ముద్గల్ కమిటీ సిఫారసులతో పోలిస్తే, ఖోస్లా సిఫారసులే ఆధునికంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సర్వోన్నత న్యాయస్థానం ప్రశంసలు కూడా పొందిన ఖోస్లా సిఫారసులను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. సెన్సార్షిప్ విషయంలో కేంద్ర ఆధిపత్యానికి స్వస్తి పలకాలని ఈ కమిటీ సలహా ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధ్యక్షుడి నాయకత్వంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చలనచిత్ర ధ్రువీకరణ బోర్డ్ ఉండాలని కూడా ఖోస్లా ప్రతిపాదించారు. కఠినమైన సెన్సార్ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ నిరంతర జోక్యాల వల్ల బోర్డ్ సభ్యులలో బాధ్యత కొరవడుతోందని, ఈ లోపమే దాని సామర్థ్యాన్ని నాశనం చేసిందని కూడా ఖోస్లా కమిటీ తేల్చి చెప్పింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వ ప్రాపకంతో నియమిస్తున్న సలహా మండళ్లను రద్దు చేయాలనీ, బోర్డ్ సభ్యులే చిత్రాలను పరిశీలించి ధ్రువీకరించే పూర్తి బాధ్యతను స్వీకరించాలని పేర్కొన్నది. అలాగే సెన్సారింగ్ మార్గదర్శకాలను రూపొందించుకునే అధికారం బోర్డ్‌కే ఉండాలని, కేంద్రం అజమాయిషీకి తావు ఉండరాదని కూడా ఖోస్లా కమిటీ భావించింది. అధికారాలన్నీ కేంద్రం దగ్గరే సెన్సార్‌బోర్డ్ ఆమోదం పొందిన సినిమాల ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వాలు సరైన కారణాలు లేకుండా నిలిపివేయడాన్ని నిరోధించే మార్గమేదన్నదే కొత్త కమిటీ పరిశీలించిన అంశాలలో ముఖ్యమైనది. కానీ దీనికి సూచించిన పరిష్కారాలు సమస్యను మరింత జటిలం చేసేటట్టు ఉన్నాయి. ఒక సినిమా ప్రదర్శన వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగినపుడు లేదా అలాంటి అవకాశాలు ఉన్నాయని భావించినపుడు ఆయా రాష్ట్రాలు ఆ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకురావాలనీ, దీని మీద కేంద్రమే తుది నిర్ణయం తీసుకోవాలనీ కమిటీ ప్రతిపాదించింది. అలాగే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ట్రిబ్యునల్‌లో సవాలు చేయవచ్చునని కూడా సూచించింది. అంటే ఇంతవరకు సినిమాలను నిషేధించే పనిని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటే, ఇకపై చిత్రప్రదర్శన కేంద్రం దయాదాక్షిణ్యాల మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిస్థితి మీద వివరాలు అందించాక, వాటి మీద కేంద్రం తుది నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి కాలపరిమితినీ నిర్దేశించలేదు. రాజ్యాంగం ప్రకారం చలన చిత్రాల ప్రదర్శన, శాంతిభద్రతలు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. ఒక సినిమా ప్రదర్శనను నిలిపివేయడం వంటి సున్నితమైన అంశాన్ని, అదికూడా రాష్ట్ర పరిధిలోకి వచ్చే విషయాన్ని కేంద్రం విచక్షణకు వదిలివేయడం రాజ్యాంగ విరుద్ధమే. ఇటువంటి సందర్భాలలో సదరు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే వెసులుబాటు కల్పించడం, తన ముందుకువచ్చిన వివాదాలను నిర్ణీత కాలవ్యవధిలోగా తేల్చడం ఈ సమస్యకు సరైన పరిష్కారం కాగలదు. అలా ఒక చిత్రప్రదర్శన నిలిపివేత అంశాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల పరిధి నుం చి తప్పించినట్టు కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశాన్ని విస్తరించి, దాని పరిధిని విస్తరించాలని కమిటీ చేసిన సిఫారసును గౌరవించినట్టు కూడా అవుతుంది. ఇంకా చెప్పాలంటే, ట్రిబ్యునల్ తీర్పు న్యాయపరమైనది కావడం వల్ల, దాని మీద అప్పీలుకు నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లవలసి ఉంటుంది. అలా ఆ నిర్ణయం నిర్దిష్టతను కూడా సంతరించుకుంటుంది. ప్రేక్షకుల ఊసేలేని నివేదిక ఈ అంశాలకు సంబంధించి విదేశాలలో అమలులో ఉన్న చట్టాలను, మంచి పద్ధతులను కమిటీ ఏమాత్రం అధ్యయనం చేయలేదు. అలాగే అంతర్జాలం, సామాజిక మీడియా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చలనచిత్ర సెన్సార్ ప్రక్రియలో ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని పెంచడం, తద్వారా బోర్డ్ నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడం వంటి ముఖ్యమైన విషయాలలో సెన్సార్‌బోర్డ్ వహించే కీలక పాత్ర గురించి కమిటీ కనీసం ప్రస్తావించలేదు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు సినిమాటోగ్రఫీ చట్టంలో పెద్దగా మార్పు లేనప్పటికీ సినిమా సెన్సార్షిప్ మీద పూర్వపు కమిటీల నివేదికలనూ కొత్త కమిటీ పరిగణనలోనికి తీసుకోలేదు. కొత్త ముసాయిదా బిల్లులో ‘కొత్త’ ప్రతిపాదనలు చాలావరకు ఇప్పుడు అమలులో ఉన్నవే. 1983 నుంచి మక్కికి మక్కి ఎత్తి రాస్తున్నవే. టీవీ చానెళ్లలో ప్రసా రం చేసే సినిమాలకు ప్రత్యేక రేటింగ్ రూపొందించవలసిన తక్షణ ఆవశ్యకతను కూడా కొత్త కమిటీ గుర్తించలేదు. ఎవరికీ పట్టని పోస్టర్ల ప్రమాదం సినిమా ప్రచార సామగ్రిలో అశ్లీల, హింసాత్మక దృశ్యాలను ప్రచురించే వికృత ధోరణులను అరికట్టడానికి సినిమా పరిశ్రమ ఆధ్వర్యంలోనే ఏర్పాటయిన ‘స్వయం నియంత్రణా’ కమిటీల పనితీరు కూడా ప్రహసనాన్ని తలపిస్తున్నది. సెన్సార్ కమిటీ కత్తిరించిన దృశ్యాలు కూడా పోస్టర్ల రూపంలో వీధి వీధినా దర్శనమిస్తున్నాయని కొత్త కమిటీ విమర్శించింది. సినిమా ప్రచారసామగ్రి మీద సెన్సార్ రేటింగ్ (ఏ, యూ/ఏ)ను ప్రదర్శించకపోవడం కూడా ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడమేనని పేర్కొన్నది. ఇలా భావించినప్పటికీ ముద్గల్ కమిటీ ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని చెప్పి ఊరుకుంది. కానీ పైరసీని తీవ్రమైన నేరంగా పేర్కొన్నది. కమిటీ పలు తిరోగమన ప్రతిపాదనలు చేయడం ఒకటైతే, వాటిమీద చర్చ లేకపోవడం దురదృష్టం. కాలంచెల్లిన సెన్సార్ వ్యవస్థను మార్చాలని తరచూ కోరే సినీ ప్రముఖులు కూడా ఈ కమిటీ గురించి నోరు మెదపడం లేదు. ఇన్ని లోపాలున్నా ఈ ముసాయిదాయే రేపోమాపో పార్లమెంటు ఆమోదం పొందే ప్రమాదం ఉందన్న సంగతి వారు ఎందుకు గుర్తించడంలేదు? (వ్యాసకర్త ‘మీడియావాచ్-ఇండియా’ ఉపాధ్యక్షులు)