'విశ్వరూపం 2' ఏమైంది..? | kamal haasan viswaroopam 2 release | Sakshi
Sakshi News home page

'విశ్వరూపం 2' ఏమైంది..?

Published Tue, Feb 9 2016 1:41 PM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

'విశ్వరూపం 2' ఏమైంది..?

'విశ్వరూపం 2' ఏమైంది..?

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా విశ్వరూపం. కమల్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించటంతో ఈ సినిమాకు సీక్వెల్ను కూడా రూపొందించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులు కావస్తున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో ఈ ఏడాది కూడా ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదంటున్నాయి చెన్నై సినీ వర్గాలు.

తొలి భాగం ఘనవిజయం సాధించటంతో రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కించాడు ఆస్కార్ రవిచంద్రన్. ఇలోగా రవిచంద్రన్ వేరే సినిమాలు నిర్మించటం, అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దీంతో విశ్వరూపం 2 పనులు ఆగిపోయాయి. షూటింగ్ పూర్తయినా, విజువల్ ఎఫెక్ట్స్తో పాటు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరో 25 కోట్లకు పైగా బడ్జెట్ అవసరం, ఇప్పట్లో అంత బడ్జెట్ పెట్టడం కుదరదనుకున్న చిత్రయూనిట్ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement