
కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ మూవీ స్టిల్
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్ సినిమాలను మాత్రం పక్కన పెట్టలేదు. త్వరలో నటనకు గుడ్‌బై చెపుతున్నట్టుగా ప్రకటించిన లోకనాయకుడు తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని విడుదలకు రెడీ చేస్తున్నాడు. కమల్ ఎన్నో కష్టనష్టాలకోర్చి తెరకెక్కించిన సినిమా విశ్వరూపం 2. ముందు ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా ఈ సినిమాను ప్రారంభించారు. కానీ తరువాత రవిచంద్రన్ తప్పుకోవటంతో కమలే నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నారు.
కమల్ స్వయంగా దర్శకత్వం వహించి నటించిన విశ్వరూపం 2 ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ నెల రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పూజ కుమార్, ఆండ్రియా, రాహుల్ బోస్, శేఖర్ కపూర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment