Mahesh Narayanan Clarifies His Movie With Kamal Haasan In Not Shelved - Sakshi
Sakshi News home page

Kamal Haasan: కమల్‌హాసన్‌ చిత్రం ఆగిపోయిందా?

Published Sun, Dec 11 2022 8:37 AM | Last Updated on Sun, Dec 11 2022 10:47 AM

Mahesh Narayanan Clarifies His Movie With Kamal Haasan In Not Shelved - Sakshi

కమల్‌ హాసన్‌తో మహేశ్‌ నారాయణన్‌

అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్, మలయాళ దర్శకుడు మహేష్‌ నారాయణన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం ఆదిలోనే ఆగిపోయిందని ప్రచారం సాగుతోంది. విశ్వరపం సినిమా నుంచి వీరి మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. మహేష్‌ నారాయణన్‌ మలయాళంలో టేక్‌ ఆఫ్, సీయూ సన్, మాలిక్‌ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన ఇటీవల వెలువడింది.

అయితే విక్రమ్‌ సంచలన విజయం సాధించడంతో ప్రస్తుతం కమల్‌హాసన్‌ శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. దర్శకులు హెచ్‌.వినోద్, మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి కమల్‌ కమిట్‌ అయ్యారు. దీంతో మహేష్‌నారాయణన్‌ దర్శకత్వంలో నటించే చిత్రం ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి వార్తలపై స్పందింన మహేష్‌ నారాయణన్‌.. తన దర్శకత్వంలో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించే చిత్రం డ్రాప్‌ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమల్‌ ఇండియన్‌– 2 చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారని చెప్పారు. ఆ చిత్రం పూర్తి కాగానే తర్వాత కొత్త చిత్రంపై చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement