Kamal Haasan Upcoming Movie Indian 2 First Look Revealed On His Birthday, Goes Viral - Sakshi
Sakshi News home page

Indian-2 Movie: కమల్ బర్త్‌డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న ఇండియన్-2 పోస్టర్

Published Mon, Nov 7 2022 4:08 PM | Last Updated on Mon, Nov 7 2022 6:28 PM

Kamal Haasan Latest Movie Indian 2 Look Revealed On His Birthday - Sakshi

విశ్వనటుడు కమల్‌హాసన్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 2’. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోమవారం కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్‌ డేట్‌తో ముందుకొచ్చింది చిత్రబృందం. ఈ మూవీలో కమల్ హాసన్ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. 

(చదవండి: తిరుపతిలో 'ఇండియన్‌-2' షూటింగ్‌)

కమల్ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పోస్టర్‌లో కమల్ వృద్ధుడి గెటప్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇటీవలే తిరుపతిలో కొన్ని కీలకమైన సీన్లు కూడా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement