Yuvraj Singh Father Yograj Acting In Kamal Haasan Indian 2 Movie - Sakshi
Sakshi News home page

Indian 2 Movie: ఇండియన్ -2 సినిమాలో పంజాబ్ నటుడు.. సోషల్ మీడియాలో వైరల్

Published Tue, Nov 1 2022 9:06 PM | Last Updated on Wed, Nov 2 2022 10:08 AM

Yuvaraj Singh Father Yograj Acting In Kamal Hasan Indian 2 Movie - Sakshi

విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  'ఇండియన్-2'. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చిది. 

ఇవాళ చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో పంజాబ్‌కు చెందిన ప్రముఖ నటుడు కనిపించనున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన మేకప్ వేసుకుంటున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

యోగ్‌ రాజ్.. తన ఇన్‌స్టాలో రాస్తూ...' ఈ చిత్రంలోని నటీనటులందరికీ నా ధన్యవాదాలు. నన్ను ఇంత అందంగా తయారు చేస్తున్న మేకప్‌ మ్యాన్‌కు థ్యాంక్స్. కమల్‌ హాసన్ ఇండియన్‌-2 సినిమాలో నటించేందుకు పంజాబ్ సింహం సిద్ధంగా ఉంది.' అంటూ రాసుకొచ్చారు. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  ఇప్పటికే తిరుపతిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement