ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్‌ భోలే షావలి | Bigg Boss Fame Bhole Shavali Emotional Comments On Kamal Haasan Indian 2 Movie, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Bhole Shavali On Indian 2 Movie: మనస్ఫూర్తిగా చెబుతున్నా.. కన్నీళ్లతోనే సినిమా చూశా: భోలే షావలి కామెంట్స్

Published Fri, Jul 12 2024 6:38 PM | Last Updated on Fri, Jul 12 2024 7:07 PM

Bigg Boss Fame Bhole Shavali Comments Kamal Haasan Indian 2 Movie

కమల్‌హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్‌-2 థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్‌ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వీక్షించిన బిగ్‌బాస్‌ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. భారతీయుడు-2 మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.

భోలే షావలి మాట్లాడుతూ..' ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశా. ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఇండియన్‌-2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement