బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలన్న హీరో! | Kollywood Hero Siddharth Movie Miss You clashing with Allu Arjun's Pushpa 2 | Sakshi
Sakshi News home page

Siddharth: బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలి: సిద్ధార్థ్

Published Tue, Nov 26 2024 4:36 PM | Last Updated on Tue, Nov 26 2024 4:50 PM

Kollywood Hero Siddharth Movie Miss You clashing with Allu Arjun's Pushpa 2

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ పెళ్లి తర్వాత తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది చిన్నాతో సూపర్ హిట్‌ కొట్టిన సిద్ధార్థ్ మరో హిట్‌ కోసం రెడీ ‍అయిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్ యూ. ఈ మూవీలో నాసామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైంది. ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మిస్ యూ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ మీట్‌లో బాక్సాఫీస్ వద్ద పోటీపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ సినిమా విడుదల తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా? మీరేందుకు డేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్‌లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ‍ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్‌నెస్‌ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. సిద్ధార్థ్ నటించిన మిస్ యు నవంబర్ 29న విడుదల కానుండగా.. అల్లు అర్జున్‌ పుష్ప -2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా.. మిస్ యూ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement