Kollywood Cinema industry
-
బాక్సాఫీస్ బరిలో పుష్ప-2.. అలా జరిగితే వాళ్లే భయపడాలన్న హీరో!
కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ పెళ్లి తర్వాత తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతేడాది చిన్నాతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ మరో హిట్ కోసం రెడీ అయిపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం మిస్ యూ. ఈ మూవీలో నాసామిరంగ ఫేమ్ ఆషిక రంగనాథ్ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమైంది. ఈనెల 29న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మిస్ యూ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ మీట్లో బాక్సాఫీస్ వద్ద పోటీపై సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీ సినిమా విడుదల తర్వాత వారం రోజుల్లోనే పుష్ప-2 రిలీజవుతోంది.. ఈ ఎఫెక్ట్ మీ చిత్రంపై ఉంటుంది కదా? మీరేందుకు డేర్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై సిద్ధార్థ్ స్పందించారు.సిద్ధార్థ్ మాట్లాడుతూ..' ఇక్కడ నా కంట్రోల్లో ఉన్నదాని గురించే నేను మాట్లాడతా. ప్రతి సినిమా పెద్ద సినిమానే. ఎంత ఖర్చు పెట్టారనేది సినిమా స్థాయి నిర్ణయించదు. మీరు చెప్పింది కూడా కరెక్టే. రెండోవారం కూడా ఆడాలంటే ముందు నా సినిమా బాగుండాలి..ప్రేక్షకులకు నచ్చాలి. అప్పుడే నా మూవీ థియేటర్లో ఆడుతుంది. తర్వాత వేరే సినిమా గురించి వాళ్లు ఆలోచించాలి. వాళ్లు భయపడాలి. అంతేకానీ ఒక మంచి సినిమాను థియేటర్లో నుంచి ఎవరూ తీయలేరు. ఈ రోజుల్లో చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే ఇది 2006 కాదు.. ఇప్పుడున్నంత సోషల్ మీడియా అవేర్నెస్ అప్పట్లో లేదు. సో మంచి సినిమాను ఎవరూ థియేటర్ నుంచి తీయలేరు కూడా' అని అన్నారు. సిద్ధార్థ్ నటించిన మిస్ యు నవంబర్ 29న విడుదల కానుండగా.. అల్లు అర్జున్ పుష్ప -2 ది రూల్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.కాగా.. మిస్ యూ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఎన్ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. -
డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో మరో ఓటీటీ సంస్థ!
ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్ శంకర్, ఎంఆర్ శీనివాసన్, సుధాకర్ కలిసి ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్ జాన్ కిళడి(పైరీ), మణివర్మన్(ఒరునొడి), ఆర్.వెంకట్(కిడా), బాలాజీ వేణుగోపాల్ (లక్కీమేన్), కన్నుసామి(వట్టార్ వళక్కు), యశ్వంత్ కిశోర్ (కన్నగి), విఘ్నేశ్కార్తీక్( హార్ట్స్పార్ట్) శరత్ జ్యోతి, రచయిత వసంత్ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్ ముణుసామివీరప్పన్(వెబ్‌సిరీస్)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్‌లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్ శంకర్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్ మరో 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్‌ఫామ్‌గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్ శంకర్ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్ అనే వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను, సెన్టెన్స్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. -
సూపర్ హిట్ డైరెక్టర్‌తో జతకట్టనున్న శింబు?
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న యంగ్ హీరో సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్ సెల్వన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లూస్టార్. ఈ చిత్రంలో నటి కీర్తి హీరోయిన్గా నటించింది. ఈ మూవీని లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేతలు గణేశ్‌మూర్తి, జి.సౌందర్యలతో కలిసి నీలం ప్రొడక్షన్స్ అధినేత, దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యుడు జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర వివరాలను తెలుపుతూ.. ఈతరం యువకులు పిచ్చిగా అభిమానించే క్రికెట్ క్రీడ, దాని చుట్టూ తిరిగే సంఘటనలు, ప్రేమ వంటి జనరంజకమైన కథాంశంతో తెరకెక్కించిన చిత్రం బ్లూస్టార్ అని పా.రంజిత్ చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి తమిళ్ అళగన్ సినిమాటోగ్రఫీ, గోవింద్ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. అశోక్‌సెల్వన్, కీర్తి వివాహానంతరం నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో శాంతను, పృథ్వీ, దివ్య ముఖ్యపాత్రలు పోషించారు. -
అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ఇప్పుడున్న సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంతా ఈజీ కాదు. ముఖ్యంగా ఇప్పుడున్న సినీ ప్రపంచంలో హీరోయిన్ల గ్లామర్ ట్రెండ్ నడుస్తోంంది. హీరోయిన్స్ సినీ రంగ ప్రవేశం చేయాలన్నా.. మరీ ముఖ్యంగా ఇక్కడ నిలదొక్కు కోవాలన్నా ప్రతిభ, గ్లామర్ ఫస్ట్ ప్రయారిటీగా మారిపోయింది. ఈ విషయాన్ని సైతం చాలామంది హీరోయిన్లు పబ్లిక్ గానే అంగీకరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా అవుననే అంటున్నారు. (ఇది చదవండి: 'బిగ్‌బాస్'లో అనుకున్నదే జరిగింది.. వెళ్తూ షకీలా ఏడిపించేసింది!) అయితే ఈ కేరళ కుట్టికి మొదట నటనపై ఆసక్తి లేదట. డాక్టర్ అవ్వాలని చదివిన ఐశ్వర్య లక్ష్మి ఆ తర్వాత మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంపై దృష్టి సారించారట. అలా పలు వాణిజ్య సంస్థలకు మోడల్‌గా పనిచేసిన ఈమె ఫొటోలు పత్రికల్లో ముఖచిత్రంగా ప్రచురితమవడం, దాంతో సినిమా అవకాశాలు రావడం అలా జరిగిపోయిందట. మలయాళంలో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి 2019లో విశాల్ కథానాయకుడు నటించిన యాక్షన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అదేవిధంగా ధనుష్‌కు జంటగా నటించిన జగమే తంధిరం కూడా నేరుగా ఓటీపీలో స్ట్రీమింగ్ కావడంతో ఆ చిత్రం కూడా ఈమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత విష్ణు విశాల్ సరసన నటించిన కట్టా కుస్తీ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో పూంగుళి పాత్రలో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా గార్గీ చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తింది. తాజాగా దుల్కర్ సల్మాన్‌కు జంటగా కింగ్ ఆఫ్ కోత్త చిత్రంలో నటించింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకు తగినట్లుగా గ్లామర్‌నే మార్గంగా ఎంచుకుంది. అందాలను ఆరబోస్తూ తీయించుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అలాంటి ఫొటోల గురించి నెటిజన్లు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ గ్లామర్‌కు మారడం తప్పనిసరి అని.. అది లేకపోతే ఈ ఫీల్డ్‌లో కొనసాగలేమని పేర్కొంది. (ఇది చదవండి: 'నా అనుమతి లేకుండా తాకాడు'..లైంగిక వేధింపులపై హీరోయిన్!) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) -
కోలీవుడ్‌లో సంచలనం.. నలుగురు స్టార్ హీరోలకు షాక్!
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నలుగురు స్టార్ హీరోలకు షాకిచ్చింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. హీరోలు ధనుశ్, శింబు, విశాల్, అథర్వకు తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. ఇకపై వీరు ఏ సినిమాల్లోను నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. (ఇది చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) నిషేధానికి కారణాలివే! నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలతోనే హీరో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ వివాదంపై ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలతో రెడ్ కార్డు ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ చేసిన సినిమా 80 శాతం షూట్ పూర్తయ్యాక.. ఆ తర్వాత సహకరించకపోవడంతో నిర్మాతకు నష్టం జరిగినట్లు తెలిసింది. అందుకే విశాల్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మదియలకన్ నిర్మాణ సంస్థతో అథర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. అయితే షూటింగ్ సమయంలో సహకరించడం లేదనే ఆరోపణలతో అథర్వకు రెడ్ కార్డు ఇవ్వనున్నట్లు సమాచారం. వీరితో పాటు నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల సంఘం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది. ఇక ఈ జాబితాలో ధనుష్, శింబు, విశాల్, అథర్వతో పాటు ఎస్జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14 మంది నటీనటులు ఉన్నట్లు సమాచారం. (ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో కుమార్తె.. డేట్ ఫిక్స్! ) మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రధాన సంఘాలైన దక్షిణ భారత నటీనటుల సంఘం, తమిళ చిత్ర నిర్మాతల సంఘం మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నటీనటుల కాల్షీట్స్, కొత్త ఒప్పందాలపై నిర్మాతల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి. అదే విధంగా నటీనటుల వైపు నుంచి కొన్ని సమస్యలు ప్రస్తావించారు. ఈ భేటీలో నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరించినందుకు నలుగురు హీరోలపై చర్యలకు దిగింది. అయితే నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్‌లు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
స్టార్ హీరోతో కుష్బూ పెళ్ళి.. నాలుగు నెలలకే విడాకులు
-
ఇక్కడ పురుషాధిక్యం ఎక్కువ
టాలీవుడ్లో నెంబర్‌వన్ నాయికగా వెలుగొందుతున్న నటి సమంత. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆ స్థాయి కోసం ఆరాటపడుతున్నారు. ఆ మధ్య సినీ పరిశ్రమలో హీరోల ఆధిక్యం ఎక్కువంటూ నోరు జారి కొందరి ఆగ్రహానికి గురైన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య తెలుగు చిత్ర ప్రచారం వ్యవహారంలో మహేష్‌బాబుపై నోరు పారేసుకుని ఆయన అభిమానుల కోపానికి బలయ్యారు. తాజాగా చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం అధికం అంటూ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదిలో గ్లామర్‌కు కాస్త దూరంగా ఉన్నా ఈ బ్యూటీ ప్రస్తుతం ధరించే దుస్తుల్లో సాధ్యమయినంత పొదుపు పాటిస్తూ విచ్చలవిడిగా అందాలారబోతతో రెచ్చిపోతున్నారు. కమర్షియల్ చిత్రాల్లో నటించడం బోరనిపించడంలేదా అన్న ప్రశ్నకు ఈ అమ్మడు బదులిస్తూ చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యం అధికం. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం అరుదనే చెప్పాలన్నారు. మహిళా ఇతి వృత్తంతో రూపొందే చిత్రాల్లో అలాంటి పాత్రల్ని ఆశించవచ్చన్నారు. కమర్షియల్ చిత్రాల్లో ప్రాముఖ్యతను ఆశించరాదన్నారు. హిందీ చిత్రం క్వీన్ రీమేక్‌లో నటించే అవకాశాన్ని అందుకోకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నకు ఆ చిత్ర ఒరిజినల్ లోని ఫీల్‌ను రీమేక్‌లో తీసుకురాగలరా? అన్న సందేహంతోనే అవకాశాన్ని అందుకోలేదన్నారు. అయితే అలాంటి బలమయిన నాయిక పాత్ర లభిస్తే నటించడానికి రెడీ అన్నారు. ఇకపోతే మీ పెళ్లెప్పుడు? ప్రియుడి గురించి చెప్పండి అని కొందరడుగుతున్న ప్రశ్నలు వేదనకు గురి చేస్తున్నాయన్నారు. ఆడది అనగానే పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అరుుపోవాలని అనే సమాజం భావిస్తోందన్నారు. పెళ్లి కంటే కూడా జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉంది. పురుషులకే సాధ్యం అనే భావనలో మార్పు రావాలని సమంత పేర్కొన్నారు.