
ఇప్పుడు చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం కష్టతరంగా మారిందన్నది ప్రత్యేకంగా చె ప్పాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చిన్న చి త్రాల నిర్మాతలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు వరప్రసాదంగా మారాయనే చెప్పాలి. అలా ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెద్ద చి త్రాల స్ట్రీమింగ్‌లో బిజీగా ఉన్నాయి. కొత్తగా ఓటీటీ ప్లస్ పేరుతో కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ప్ర ముఖ సినీ విమర్శకుడు, దర్శకుడు కేబుల్ శంకర్, ఎంఆర్ శీనివాసన్, సుధాకర్ కలిసి ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగిన దీని ప్రారంభోత్సవంలో జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత దర్శకుడు శీనూ రామస్వామి ముఖ్యఅతిథిగా హాజరైన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
అదే విధంగా ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల యంగ్ డైరెక్టర్స్ జాన్ కిళడి(పైరీ), మణివర్మన్(ఒరునొడి), ఆర్.వెంకట్(కిడా), బాలాజీ వేణుగోపాల్ (లక్కీమేన్), కన్నుసామి(వట్టార్ వళక్కు), యశ్వంత్ కిశోర్ (కన్నగి), విఘ్నేశ్‌కార్తీక్( హార్ట్‌స్పార్ట్) శరత్ జ్యోతి, రచయిత వసంత్ బాలక్రిష్ణన్, జయచంద్ర హస్మీ (కూస్ ముణుసామివీరప్పన్(వెబ్‌సిరీస్)ను అభినందించి వారికి జ్ఞాపికలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్ భవిష్యత్‌లో కొత్తగా వచ్చే వారికి వరప్రసాదం అవుతుందన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వర్థమాన దర్శకుల చిత్రాలను ప్రశంసించారు. వారిని తనతో గౌరవింపజేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ ఓటీటీ ప్లస్ ప్లాట్‌ఫామ్ నిర్వాహకుల్లో ఒకరైన కేబుల్ శంకర్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల అవసరం నానాటికీ పెరిగిపోతోందన్నారు. అలా ఈ ఓటీటీ ప్లస్ మరో 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లతో కలిసి పని చేస్తోందని చెప్పారు. మరిన్ని ఓటీటీ సంస్థలను ఒకే ప్లాట్‌ఫామ్‌గా చేయాలన్నదే తమ భావన అని పేర్కొన్నారు. రోజుకు ఒక్క రూపాయి చెల్లించి ఈ ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌సిరీస్, లఘు చిత్రాలు చూడవచ్చని చెప్పారు. కాగా ఈ కార్యక్రమానికి ముందు కేబుల్ శంకర్ దర్శకత్వం వహించిన ఫెమినిస్ట్ అనే వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్‌ను, సెన్టెన్స్ అనే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment