కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment