కమల్‌హాసన్‌ 'థగ్‌ లైఫ్‌'.. ఆ హీరోను రిప్లేస్‌ చేశారు! | Silambarasan Joins In maniratnam Big Movie Thug Life | Sakshi
Sakshi News home page

Thug Life: కమల్‌హాసన్‌ 'థగ్‌ లైఫ్‌'.. ఆ హీరో తప్పుకోవడంతో!

Published Thu, May 9 2024 2:14 PM | Last Updated on Thu, May 9 2024 3:14 PM

Silambarasan Joins In maniratnam Big Movie Thug Life

మణిరత్నం- కమల్‌ హాసన్‌ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్‌ లైఫ్‌'.  నాయగన్‌(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న  గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్‌లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్‌ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్‌.

కారును వేగంగా డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చి, గన్‌తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్‌హాసన్, శింబులతో పాటు  ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తవగానే ‘థగ్‌ లైఫ్‌’ టీమ్‌ లండన్‌ వెళుతుందని కోలీవుడ్‌ సమాచారం. 

రెడ్‌ జెయింట్‌ మూవీస్, మద్రాస్‌ టాకీస్‌ పతాకాలపై  నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్‌ లైఫ్‌’ సినిమా నుంచి దుల్కర్‌ సల్మాన్‌ తప్పుకున్నారని.. ఈ ప్లేస్‌లోనే శింబును ఎంపిక చేశారని టాక్‌. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా..  ఆ పాత్రను అశోక్‌ సెల్వన్‌ చేస్తారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement