క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న యంగ్ హీరో సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే? | kollywood Star Ashok Selvan New Film Released On This date | Sakshi
Sakshi News home page

Blue Star: క్రికెట్ నేపథ్యంలో వస్తోన్న బ్లూ స్టార్..!

Published Sun, Jan 7 2024 7:36 AM | Last Updated on Sun, Jan 7 2024 7:38 AM

kollywood Star Ashok Selvan New Film Released On This date - Sakshi

వైవిధ్యభరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న నటుడు అశోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం బ్లూస్టార్‌. ఈ చిత్రంలో నటి కీర్తి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని లెమన్‌ లీఫ్‌ క్రియేషన్స్‌ సంస్థ అధినేతలు గణేశ్‌మూర్తి, జి.సౌందర్యలతో కలిసి నీలం ప్రొడక్షన్స్‌ అధినేత, దర్శకుడు పా.రంజిత్‌ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యుడు జయకుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ఈ చిత్ర వివరాలను తెలుపుతూ.. ఈతరం యువకులు పిచ్చిగా అభిమానించే క్రికెట్‌ క్రీడ, దాని చుట్టూ తిరిగే సంఘటనలు, ప్రేమ వంటి జనరంజకమైన కథాంశంతో తెరకెక్కించిన చిత్రం బ్లూస్టార్‌ అని పా.రంజిత్ చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి తమిళ్‌ అళగన్‌ సినిమాటోగ్రఫీ, గోవింద్‌ వసంత సంగీతాన్ని అందిస్తున్నారు. అశోక్‌సెల్వన్‌, కీర్తి వివాహానంతరం నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో శాంతను, పృథ్వీ, దివ్య ముఖ్యపాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement