![Ashok Selvan, Keerthi Pandian First Sakranthi After Wedding - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/16/ashok-selvan-keerthi-pandian-01.jpg.webp?itok=yYGTAMuR)
చలనచిత్ర పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు ఆఫ్‌స్క్రీన్‌లోనూ జోడీ కట్టాయి. రీల్ పెయిర్‌గానే కాకుండా రియల్ పెయిర్‌గా గుర్తింపు పొందాయి. తమిళ హీరో అశోక్ సెల్వన్, హీరోయిన్ కీర్తి పాండియన్ ఇదే కోవలోకి వస్తారు. వీరిద్దరూ గతేడాది సెప్టెంబర్ 13న పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత తొలిసారి సంక్రాంతి పండగను కలిసి జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కీర్తి పాండియన్, అశోక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అయితే సెట్స్‌లోనే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. తమకు అసలైన పొంగల్ జనవరి 25 రోజునే అంటోందీ జంట. ఎందుకంటే ఆ రోజు వీరు జంటగా నటించిన బ్లూస్టార్ మూవీ రిలీజ్ కానుంది.
ఇకపోతే పిజ్జా 2, భద్రమ్ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు వారికీ పరిచయమ్యాడు అశోక్. 2020లో వచ్చిన ఓ మై కడవులే సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో అప్పటినుంచి అశోక్ క్రేజ్ పెరిగిపోయింది. ఈ మధ్యే పోర్ తొళిల్ అనే మూవీతో హిట్ కొట్టాడు. కీర్తి పాండియన్ విషయానికి వస్తే తుంబా, అన్బిర్కినియాల్ సినిమాలతో ఆకట్టుకుంది. అశోక్ నటించిన సభానాయగన్, కీర్తి నటించిన కన్నగి గతేడాది డిసెంబర్ 15న ఒకేసారి విడుదలవడం విశేషం.
వీరిద్దరూ జంటగా నటించిన బ్లూస్టార్ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ మూవీని లెమన్ లీఫ్ క్రియేషన్స్ సంస్థ అధినేతలు గణేశ్‌మూర్తి, జి.సౌందర్యలతో కలిసి నీలం ప్రొడక్షన్స్ అధినేత, దర్శకుడు పా.రంజిత్ నిర్మించారు. ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జయకుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
చదవండి: రోజురోజుకీ పెరుగుతున్న వసూళ్లు.. మూడు రోజుల్లో ఎంతొచ్చిందంటే?
Comments
Please login to add a commentAdd a comment