అరుదైన సంఘటన.. బాక్సాఫీస్ బరిలో స్టార్ కపుల్..! | Ashok Selvan and Keerthi Pandian at box office 3 months after marriage | Sakshi
Sakshi News home page

Keerthi: బాక్సాఫీస్ బరిలో భార్యభర్తలు.. పెళ్లయిన మూడు నెలలకే!

Published Wed, Nov 29 2023 10:58 AM | Last Updated on Wed, Nov 29 2023 11:47 AM

Ashok Selvan and Keerthi Pandian at Box Office 3 months after marriage - Sakshi

ప్రముఖ తమిళ నటుడు అశోక్ సెల్వన్, నటి కీర్తి పాండియన్ ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఈ ఏడాది సెప్టెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ జంట ప్రస్తుతం పా రంజిత్ నిర్మిస్తున్న 'బ్లూ స్టార్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

అయితే.. ఇదిలా ఉండగా కోలీవుడ్‌లో భార్య, భర్తలే బాక్సాఫీస్ పోటీకి రెడీ అయ్యారు.  అశోక్, కీర్తి నటించిన రెండు చిత్రాలు డిసెంబరు 15న బాక్సాఫీస్ వద్ద ఢీకొంటున్నాయి. అశోక్ సెల్వన్ నటించిన 'సబానాయగన్', కీర్తి పాండ్యన్ ప్రధానపాత్రలో వస్తోన్న కన్నగి ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. నిజ జీవితంలో భార్యాభర్తలై వీరిద్దరి సినిమాలు ఓకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం కోలీవుడ్‌లో అరుదైన సంఘటన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీఎస్ కార్తికేయ దర్శకత్వం వహించిన చిత్రం 'సబా నాయగన్'. ఈ చిత్రంలో అశోక్ సెల్వన్, మేఘా ఆకాష్, కార్తీక మురళీధరన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.  మరోవైపు షాలిన్ జోయా దర్శకత్వం వహించిన 'కన్నగి'లో కీర్తి పాండియన్ గర్భిణీ స్త్రీ పాత్రలో నటించింది. యశ్వంత్ కిషోర్  దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో వెట్రి, అధేశ్వర్, అమ్ము అభిరామి, విద్యా ప్రదీప్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న ఈ జంట బాక్సాఫీస్ వద్ద పోటీలో నిలవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement