Bhole Shavali
-
ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నా: బిగ్‌బాస్ భోలే షావలి
కమల్‌హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ అవేటైడ్ చిత్రం ఇండియన్-2 థియేటర్లలోకి వచ్చేసింది. ఉదయం ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కమల్ హాసన్ నటన, సిద్దార్థ్ ఫర్మామెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వీక్షించిన బిగ్‌బాస్ ఫేమ్ భోలే షావలి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతీయుడు-2 మూవీతో సిద్ధార్థ్ జన్మ ధన్యమైపోయిందని అన్నారు.భోలే షావలి మాట్లాడుతూ..' ఈ సినిమాతో సిద్ధార్ధ్ జన్మ ధన్యమైపోయింది. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. సినిమా చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా. కళ్లు తుడుచుకుంటూనే సినిమా చూశా. ఇక్కడ ఇండియన్-3 గురించి చిన్న హింట్ ఇచ్చారు. స్వాతంత్ర్య పోరాటం మళ్లీ మన కళ్ల ముందు కనిపించేలా ఉండనుంది' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. 1996లో వచ్చిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా ఇండియన్-2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. #Kalki2898AD రేంజ్ లో #Bharateeyudu2 ఎంజాయ్ చేస్తారు - Audience ReactionWatch Full public response here ▶️ https://t.co/rez0iLsFFFRead review here 🔗 https://t.co/8I8RV7o8em#KamalHaasan #Shankar #Indian2 #TeluguFilmNagar pic.twitter.com/XnxlwRPuXr— Telugu FilmNagar (@telugufilmnagar) July 12, 2024 -
'బిగ్‌బాస్' ఓటీటీ తెలుగు సీజన్ రద్దు? అదే అసలు కారణమా?
బిగ్‌బాస్ రియాలిటీ షో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మొన్నీమధ్యే డిసెంబరులో ఏడో సీజన్ పూర్తయింది. ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలవడం.. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట విధ్వంసం.. కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం.. ఇలా ఎంత జరగాలో అంతా జరిగింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో ఓటీటీ సీజన్ ఉందన్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడేమో ఏకంగా అది రద్దయినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఏమైంది? రద్దుకు కారణమేంటి? తెలుగులో బిగ్‌బాస్ షో ఇప్పటివరకు ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ హిట్ అయింది. ఆ తర్వాత నుంచి మాత్రం ఏదో ఒక గొడవ అవుతూనే ఉంది. షో ఆపేయాలని విమర్శలు.. కోర్టు కేసులు.. ఇలా ప్రతిసారి రచ్చ అవుతూనే ఉంటుంది. ఇన్ని జరుగుతున్నా సరే షోని ఆపట్లేదు సరికదా ఓటీటీ సీజన్ కూడా ఆ మధ్యలో ఒకటి పెట్టారు. పాతవాళ్లతో పాటు కొత్తవాళ్లు పాల్గొన్న ఆ సీజన్లో బింధుమాధవి విన్నర్‌గా నిలిచింది. కాకపోతే ఆ సీజన్ ఫెయిలైంది. (ఇదీ చదవండి: స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి?) అయితే రీసెంట్గా జరిగిన ఏడో సీజన్.. విమర్శల కారణంగా వార్తల్లో నిలిచింది. దీన్ని క్యాష్ చేసుకుందామని నిర్వహకులు పెద్ద ప్లాన్ వేశారు. ఫిబ్రవరిలో తొలి వారంలో ఓటీటీ సీజన్ మొదలుపెట్టేయాలని అనుకున్నారు. ఏడో సీజన్లో పాల్గొన్న భోలె షావళి, నయన పావని తోపాటు యావర్ కూడా ఈ సీజన్లో పాల్గొంటారని రూమర్స్ వచ్చాయి. కానీ వీళ్లు తప్పితే మిగతా వాళ్లు ఎవరూ దీనిపై కనీస ఆసక్తి చూపించట్లేదట. టీవీ సీజన్ అయితే వస్తాం గానీ ఓటీటీ సీజన్‌కి మాత్రం వచ్చేది లేదని చెబుతున్నారట. రెమ్యునరేషన్ పెంచి ఇస్తామని చెప్పినా సరే పెద్దగా ఆసక్తి చూపించట్లేదట. మరోవైపు నాగార్జున కూడా అందుబాటులో ఉండట్లేదు. దీంతో హోస్ట్ కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఇలా సమస్యలు ఎక్కువయ్యేసరికి నిర్వహకులు.. సీజన్‌ని రద్దు చేయాలని ఫిక్సయ్యారట. మరి ఇందులో నిజమేంటి అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) -
హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఎంతో ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. తమలో ఉన్న టాలెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ టాలెంట్‌తో నెట్టింట చెలరేగి పోతున్నారు. అలా జనాలకు పరిచయమైన వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా.. మళ్లొచ్చిన అంటూ వీడియోలు చేసుకునే ఇతడు రైతుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. రైతు కష్టాలు చెప్తూ, పొలం పని చేస్తూ తీసిన వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. కేసులో ఇరుక్కున్న రైతుబిడ్డ అంతే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోనూ అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతో, మాటతో ప్రేక్షకులను మెప్పించి.. బిగ్‌బాస్ 7 టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసి జైలుపాలయ్యాడు. తర్వాత భోలె షావళి చొరవ తీసుకుని లాయర్‌ను మాట్లాడి మరీ ఈ కేసు నుంచి ప్రశాంత్‌ను బయటకు తీసుకువచ్చాడు. అయితే ప్రశాంత్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్తున్నాడు సింగర్ భోలె. హీరోగా సినిమా ఛాన్సులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ప్రశాంత్‌కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయుంటే ఈపాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతుబిడ్డ హీరోగా చేస్తాడా? అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయుంటే తను డిప్రెషన్లోకి వెళ్లిపోయేవాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకపోయినా బాగుండు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంతే ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తనమీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలన్నది నా కల. ఇటు హీరోగా కూడా చేస్తా. ఆల్‌రౌండర్‌గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను' అంటున్నాడు భోలె షావళి. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆసక్తికర ట్వీట్ చేసిన ఉపాసన.. భర్తపై ఎంత ప్రేమో.. -
బిగ్ బాస్ OTT: బర్రెలక్కతో పాటు సీజన్-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ హిట్ అయినట్లు సోషల్ మీడియాలో భారీగానే వార్తలు వచ్చాయి. బిగ్ బాస్-7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవడం... ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవల వల్ల ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం.. చివరకు రెండు రోజుల పాటు ఆయన చంచల్‌గూడ జైలుకు కూడా వెళ్లడం వంటి సంఘటనలతో ఇప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్-7 టాపిక్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: రూ.500కోట్ల క్లబ్లో సలార్.. మరో వంద కోట్లు వస్తే) ఈ సీజన్ హిట్ కావడంతో బిగ్ బాస్ OTT -2 కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. గతేడాది ఫిబ్రవరిలో ‘బిగ్‌బాస్ నాన్- స్టాప్ పేరుతో హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం అయింది. 24/7 వినోదం పంచేందుకు 2022లో మొదటిసారి ఓటీటీలోకి కూడా వచ్చేశాడు బిగ్ బాస్. అప్పుడు కూడా ఈ షో పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది. గతంలో మాదిరే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యహరిస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ OTT సీజన్-1 విజేతగా తెలుగు హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. బిగ్ బాస్ OTTలో ఒక ప్రత్యేకత ఉంది ఇందులో కొత్త, పాత కంటెస్టెంట్లు కూడా ఉంటారు. అంటే బుల్లితెర బిగ్ బాస్‌లో కనిపించిన కొంతమంది OTTలో కూడా పాల్గొంటారు. SPY బ్యాచ్ వర్గం నుంచి ఆ ఇద్దరికి ఛాన్స్ బిగ్ బాస్ సీజన్-7లో బాగా పాపులర్ అయిన కొంతమందిని ఓటీటీ కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. SPY బ్యాచ్‌కు మద్ధతుగా నిలిచిన భోలే షావళి, నయని పావణిని బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 కోసం తీసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా ఈసారి బిగ్ బాస్‌లో మంచి ఇంపాక్ట్ చూపారు. తాజాగా పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ కోసం భోలే ఎక్కువగా చొరవ చూపారు. దీంతో ఆయనకు షోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని బిగ్ బాస్ టీమ్ ఓటీటీ కోసం క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్. బర్రెలక్కతో పాటు పార్వతి కూడా అవకాశం బిగ్ బాస్ ఓటీటీలోకి కర్నె శిరీష (బర్రెలక్క) కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్‌బేస్ ఎక్కువగా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసింది. సుమారుగా 6 వేల ఓట్లు సాధించి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా జనసేన అభ్యర్థుల కంటే ఆమెకే ఎక్కువగా ఓట్లు రావడంతో ఆమె పేరును పెద్దపెద్ద రాజకీయ నాయకులే బహిరంగంగా పలికారు. దీంతో ఆమె పేరు రెండు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అయిపోయింది. ఈ ఇమేజ్ను బిగ్ బాస్ టీమ్ క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. బగ్ బాస్ ఓటీటీ కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు జీ తెలుగులో వచ్చిన 'సరిగమప' షో ద్వారా సింగర్‌గా పరిచయమైన పార్వతిని కూడా బిగ్ బాస్ వారు కలిశారట. యూట్యూబ్‌లో నవాబ్ కిచెన్ పేరుతో మోయిన్ భాయ్ చాలా పాపులర్ అయ్యాడు. ఆయన్ను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని సమాచారం. వీరితో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని బిగ్ బాస్ టీమ్ కలుస్తున్నట్లు సమాచారం. 2024 ఫిబ్రవరిలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ప్రారంభం కానుందని టాక్ ఉంది. -
రైతుబిడ్డకంత నాలెడ్జ్ లేదు..
-
నా పాట, అతడి ఆట జైలుపాలైంది.. ఏడ్చేసిన భోలె షావళి
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడానికి వస్తే తమను అసభ్య పదజాలంతో దూషించాడని కొందరు యాంకర్లు ప్రశాంత్ మీద ఆరోపణలు చేశాడు. తనను కావాలని నెగెటివ్ చేస్తున్నారంటూ అరెస్టుకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాజాగా ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. జనం కోసం ఆడాలి.. 'అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్‌లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్‌లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వరకు తీసుకెళ్లండి. ఆనందంలో ఏం చేశాడో తెలియలేదు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్‌కు తెలియదు. అభిమానులు చాలామంది వచ్చారు. ఇంతమంది ఓటేస్తే గెలిచానన్న ఆనందంలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియలేదు. ఆయన నేరం చేయలేదు. టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలైతే ఆయన ఎంత మానసిక క్షోభ పడతాడు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్‌ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
నాకేదైనా అయితే ఆ ఐదుగురే కారణం.. వీడియోలున్నాయ్!
ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మెదులుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు. అంతిమంగా అందరినీ వెనక్కు నెట్టి బిగ్‌బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు. కానీ ఈ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. పోలీసుల మాటలు బేఖాతరు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్‌ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమన్నారు పోలీసులు. ఇతడు మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కావాలనే నెగెటివ్ చేస్తున్నారు అయితే తాను అరెస్ట్ అవడానికి ముందు ప్రశాంత్.. అసలేం జరిగిందనేదానిపై వివరణ ఇస్తూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నాకు సరిగా తిండీ నిద్ర లేదు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిన. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్లు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురైదుగురి ఫోటోలు, వీడియోలు మావాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత! పోలీసులు చెప్పారు, కానీ.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్ అయిన. నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా? అనుకున్నాను. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు.. నేను దొంగలాగా వెనుక నుంచి వెళ్లను.. ముందు గేట్ నుంచే వెళ్తానని చెప్పాను. వాళ్లు ఇంకా ఏమని చెప్పారో ఆ రణగొణ ధ్వనుల మధ్య నాకు వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు.. కానీ అప్పుడు నాకు ఏదీ సరిగా వినబడకపోవడంతో అలాగే ముందుకు వెళ్లాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నాకేదైనా అయినా, నా ఇంట్లోవాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి' అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'పర్ఫ్యూమ్'.. టైటిల్ సాంగ్ రిలీజ్!
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పర్ఫ్యూమ్’. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను బిగ్‌బాస్ కంటెస్టెంట్ భోలె షావలి, భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పర్ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేయగా.. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. ఈ పాటను వరం, కీర్తన శర్మ ఆలపించారు. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇంతవరకు ఎప్పుడు రాని స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ సంగీతం అందిస్తున్నారు. -
అతను రైతుబిడ్డ.. నేను పాటబిడ్డ.. శివాజీని ఎప్పుడలా చూడలేదు!
బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పదకొండో వారానికి చేరుకున్న తెలుగువారి రియాలిటీ షో ఈసారి మరింత సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భోలె షావలి పదో వారం ఎలిమినేట్ అయ్యారు. హోస్లో ఉన్నది కొద్ది వారాలే అయినా.. తన పంచ్‌లు, పాటలతో అందరినీ అలరించాడు. అయితే హౌస్‌లో ఉన్నన్ని రోజులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా నిలిచాడనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన భోలె షావలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్, శివాజీకి మద్దతుగా ఉన్నారన్న విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటో చూద్దాం. భోలె షావలి మాట్లాడుతూ..' నేను వైల్ట్ కార్డ్‌పై హౌస్‌లోకి వెళ్లా. కానీ నేను ప్రశాంత్ బిగ్ బాస్‌లోకి వెళ్లకముందే అతని వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నా. ఇది చూసిన ప్రశాంత్ క్లోజ్ ఫ్రెండ్ గన్ను అనే వ్యక్తి నన్ను అడిగాడు. సార్.. మీరు ఏంటి ఇలా పెట్టారని అడిగాడు. అవును.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకే ఆలాంటి ఐడియా రాలేదు. అలాంటిది అతను పోరాడుతుంటే ప్రోత్సహించడం నా ధర్మం అని చెప్పా. కట్ చేస్తే ఇద్దరం బిగ్‌బాస్‌లో ఉన్నాం. అతను రైతు బిడ్డ.. నేను పాట బిడ్డ అంతే. కానీ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. శివాజీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. ఆయన పెద్ద నటుడిగా ఉండి.. బిగ్ బాస్‌కు వెళ్లడమే గొప్ప. అంతే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను అలా మారిపోయా. ఆయనను కంటెస్టెంట్‌గా ఎప్పుడూ చూడలేదు. శివాజీని ఒక హీరోలాగానే చూశాను. కానీ నేను హీరో అవుతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. భోలె షావలి బిగ్‌బాస్‌లో తన మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. -
రైతు బిడ్డ కోసమే హౌస్‌లో అడుగుపెట్టారా?.. భోలె షావలి సమాధానం ఇదే!
బిగ్ బాస్ సీజన్ -7 మరో వారం ముగిసింది. ఇప్పటి వరకు పది వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రేక్షకులను అలరిస్తోంది. దీపావళికి కొత్త కొత్త సర్ప్రైజ్లతో కంటెస్టెంట్లను ఆశ్చర్యానికి గురి చేశారు బిగ్ బాస్. అయితే గత వారంలో ఫ్యామిలీ మెంబర్స్‌ను హౌస్‌లోకి పంపించి ఎమోషనల్‌గా మార్చేశారు. ఆదివారం దీపావళి కావడంతో పండుగ రోజే కంటెస్టెంట్స్ అందరికీ కుటుంబ సభ్యులు, స్నేహితులను తీసుకొచ్చి మరింత సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఆదివారం కావడంతో ఈ వారం ఎలిమినేట్ ఎవరు? అనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో ఒకరు తప్పకుండా బయటకి వెళ్లాల్సిందే.అయితే ఈ వారంలో శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలె ఈసారి నామినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే శివాజీ, రతిక, గౌతమ్ సేఫ్ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్.. యావర్, భోలె మిగిలారు. చివరికీ తక్కువ ఓట్లు సాధించిన భోలె షావలి ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. బయటకొచ్చే కంటెస్టెంట్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకు హాజరైన భోలె షావలి యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తనదైన శైలితో సమాధానాలు చెప్పి ప్రేక్షకులను కడుప్పుబ్బా నవ్వించారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. నెట్టింట తెగ వైరలవుతోంది. అసలు బిగ్ బాస్‌కు ఎందుకొచ్చారని యాంకర్ ప్రశ్నించగా.. అంటే నాకైతే పంచభక్ష పరమాన్నం వాళ్లకు ఇచ్చాననే అనుకుంటున్నా అని భోలె షావలి ఆన్సరిచ్చారు. మీరు పల్లవి ప్రశాంత్‌కు డప్పు కొట్టడానికే హౌస్‌లోకి వచ్చారా? అని అడగడంతో.. అతను పాట బిడ్డ, రైతు బిడ్డ అందుకే.. కానీ దాన్ని భజన అనొద్దు అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మీకు బిగ్ బాస్ గేమ్ అర్థమే కాలేదు అంటే ఏమంటారు? అని మరో ప్రశ్న వేయగా.. వస్తు ఉంటే మంచిగా అర్థమైంది.. కానీ అర్థమయ్యే టైమ్‌కి వ్యర్థమైంది అంటూ మరోసారి నవ్వులు పూయించారు. అమర్దీప్ అబద్ధాల కోరు అని అన్నారు? ఎప్పుడు అబద్ధాలు చెప్పారు? అని ప్రశ్నించడంతో.. 'నాకైతే నిజంగా గుర్తులేదు.. నేనెప్పుడు నిజాలే మాట్లాడుతా' అంటూ నవ్వుతూ సమాధానాలిచ్చారు. మొత్తానికి పదో వారంలో ఎలిమినేట్ అయిన భోలె షావలి తన సమాధానాలతో యాంకర్‌నే ముప్పుతిప్పలు పెట్టినట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. -
బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్ ఫైవ్ రేసులో ఉంది. ► మొదట అమర్ దీప్ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్ స్నేహితుడు అయిన మానస్ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది తేల్చేశారు. ► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్ మదీన్ వచ్చాడు. ► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► అర్జున్ కోసం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్ ఫైవ్ ఉండేది వీళ్లే.. ► గౌతమ్ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే.. ► పల్లవి ప్రశాంత్ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► ప్రియాంక జైన్ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ వీళ్లే ► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► యావర్ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ లిస్ట్ ఇదే -
Bigg Boss 7: భోలె షాకింగ్ ఎలిమినేషన్.. ఆ తప్పులే కొంపముంచాయ్!?
బిగ్‌బాస్ షోలో ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. సోమవారం నామినేషన్స్ పూర్తవగానే.. బయటకెళ్లేది ఎవరనేది ప్రేక్షకులు గెస్ చేస్తుంటారు. ఈ సీజన్లో దాదాపు అన్నిసార్లు అది నిజమైంది కూడా. ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. పాటబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్, మ్యూజిక్ కంపోజర్ భోలె షావళి ఎలిమినేట్ అయిపోయాడు. ఇలాంటి చిత్రమైన క్యారెక్టర్ ఎలిమినేట్ కావడానికి కారణాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది. కాపీ కొట్టడం శాపమైందా? వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌసులోకి వచ్చిన భోలె.. తనని తాను పాటబిడ్డగా పరిచయం చేసుకున్నాడు. అయితే అప్పటికే హౌసులోకి రైతుబిడ్డ ట్యాగ్‌తో ప్రశాంత్ ఉన్నాడు. పాటబిడ్డ అనే పేరు ప్రశాంత్‌ని చూసి కాపీ కొట్టినట్లు అనిపించింది. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండిపోదామని వచ్చానని ఓ సందర్భంలో భోలె అన్నాడు. అది కూడా శివాజీ బిహేవియర్‌ని కాపీ కొట్టినట్లు అనిపించింది తప్పితే కొత్తగా ఏం అనిపించలేదు. ఈ రెండు విషయాల్లోనూ డిఫరెంట్ అప్రోచ్‌తో భోలె వచ్చుండాల్సింది. మాట, పాట తేడా కొట్టాయా? స్వతహాగా సింగర్ అయిన భోలె.. బిగ్‌బాస్‌లో ఉన్నన్నిరోజులు మాట్లాడినప్పుడు గానీ ఎవరైనా తనని నామినేట్ చేసినప్పుడు గానీ విచిత్రంగా ప్రవర్తించేవాడు. స్ట్రెయిట్‌గా సమాధానం ఇవ్వకుండా ఏదో పాడుతూ, అర్ధం లేకుండా మాట్లాడుతూ అందరికీ మెంటల్ ఎక్కించేసేవాడు. ఇవన్నీ కాదన్నట్లు వచ్చిన వెంటనే శివాజీ బ్యాచులో కలిసిపోయాడు. దీంతో సీరియల్ బ్యాచ్‌కి టార్గెట్ అయిపోయాడు. ఈ వారం మహారాణులు తీర్మానంతో ఐదుగురిలో ఒకడిగా భోలె నామినేట్ అయ్యాడు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు. సో అదన్నమాట విషయం. -
Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?
బిగ్‌బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్‌తో పదోవారం ముగిసింది. గత తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది హౌస్ నుంచి బయటకెళ్లిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ నడిచింది. అయితే అందరూ రతిక ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అనుహ్యంగా భోలె ఎలిమినేట్ అయిపోయాడు. పాడ పాడుతూ, నవ్వుకుంటూ హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. భోలె ఎలిమినేట్ ఈ వారం ఎలిమినేషన్.. రాజమాతలు అనే కాన్సెప్ట్ ప్రకారం జరిగింది. దీంతో అమ్మాయిలందరూ రాజమాతల్లా ఉండి ఎవరూ నామినేట్ కావాలనేది డిసైడ్ చేశారు. అలా శివాజీ, గౌతమ్, యవర్, భోలె, రతిక.. ఎలిమినేషన్స్‌లో నిలిచారు. ఇందులో ఎప్పటిలానే శివాజీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో యవర్, గౌతమ్ నిలిచారు. చివరి రెండు స్థానాల్లో రతిక-భోలె మధ్య కాస్త నడిచింది. కానీ భోలెపై వేటు పడింది. మరో ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: లవ్‌స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?) సంపాదన గట్టిగానే వైల్డ్‌కార్డ్ కోటాలో పాటబిడ్డ అనే ట్యాగుతో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. ఆట కంటే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ గేమ్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. శివాజీ బ్యాచులో ఉండటం, కాస్త ఎంటర్టైన్ చేయడంతో దాదాపు ఐదు వారాలు ఎలాగోలా బండి లాక్కుంటూ వచ్చేశాడు. అలానే అమ్మాయిలతో గొడవ, బూతులు మాట్లాడటం లాంటివి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేషన్స్లోనూ అందరూ మనోడి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేసరికి భోలెపై వేటు తప్పలేదు. ఇకపోతే భోలె.. రోజుకు రూ.35 వేల చొప్పున అంటే వారానికి దాదాపు రూ.2.5 లక్షల లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కేసుకుంటే ఐదు వారాలకుగానూ రూ.12 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఇప్పటివరకు భోలెనే కాస్త ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు లెక్క. ఏదైతేనేం మనోడు వచ్చిన తొలివారంలో చెప్పినట్లు ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నాడు. మంచిగా సంపాదించి, కాస్త పేరు తెచ్చుకుని హౌస్ నుంచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్) -
Bigg Boss 7: లవ్‌స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. అలానే కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. ఈ షో సాక్షిగా తన ప్రియుడ్ని పరిచయం చేసింది. వాళ్ల లవ్‌స్టోరీ కూడా మొత్తం బయటపడింది. ఓ మాదిరి ఎంటర్టైనింగ్గా సాగిన ఈ ఎపిసోడ్ లో ఓవరాల్‌గా ఏం జరిగిందనేది Day 70 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) దీపావళి గేమ్‌తో షురూ ఈ ఆదివారం దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ కళకళలాడింది. హౌస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ అందరూ నిండుగా ముస్తాబై వచ్చారు. 'ఫైండ్ ద క్రాకర్' అనే చిన్న పోటీతో ఎపిసోడ్ మొదలైంది. ఈ గేమ్ లో ప్రియాంక-అమరదీప్ జోడీ గెలిచింది. దీని తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి ఫ్యామిలీ మెంబర్స్-ఫ్రెండ్స్ స్టేజీపైకి వచ్చారు. హౌస్మేట్స్ అందరితోనూ మాట్లాడుతూ ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఇంకా మెరుగవ్వాలి అని సలహాలు ఇచ్చారు. అలానే ఆయా కంటెస్టెంట్ కి సపోర్ట్‌గా వచ్చినవాళ్లు ఓవరాల్ టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్-5 వాళ్లే ఇకపోతే అమరదీప్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి శోభాశెట్టి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతూ ఎవరైతే ఈసారి టాప్-5లో ఉండొచ్చనేది గెస్ చేశారు. అయితే ఓవరాల్ లిస్టు చూసుకుంటే ప్రతిఒక్కరూ శివాజీకి ఏదో ఓ స్థానంలో పెట్టారు. దీంతో అతడికి 11 ఓట్లు పడ్డాయి. ఇతడి తర్వాత ప్రశాంత్‌కి 7, అమరదీప్-ప్రియాంకకు చెరో 6, గౌతమ్‌కి 5 ఓట్లు పడ్డాయి. మిగిలిన హౌస్‌మేట్స్‌కి ఒకటి రెండు ఓట్లు పడ్డాయంతే. దీనిబట్టి చూసుకుంటే.. ఈసారి టాప్-5లో శివాజీ, ప్రశాంత్, అమరదీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయపడ్డారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్) శోభా లవర్ ఆగయా దీపావళి ఎపిసోడ్‌కి ఆయా హౌస్మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా! శోభా కోసం మాత్రం ఆమె తండ్రితో పాటు బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి వచ్చాడు. అలా శోభా-యశ్వంత్.. బిగ్‌బాస్ సాక్షిగా తమ ప్రేమకథని బయటపెట్టారు. దాదాపు మూడన్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలానే శోభానే తొలుత ప్రపోజ్ చేసిందని, యశ్వంత్ బయటపెట్టాడు. 'నీకు నేను లైఫ్ లాంగ్ ఉంటాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీ కష్టాల్లో, సుఖాల్లో తోడుంటాను, నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా తోడుంటాను, పెళ్లి చేసుకుందాం అని అడిగింది. దీంతో నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ తను చెప్పిన తర్వాత ఓకే అన్నాను' అని శోభా బాయ్‌ఫ్రెండ్ మొత్తం విషయాన్ని చెప్పాడు. అయితే రఫ్ అండ్ టఫ్ గా ఉండే శోభా.. ముందే తానే ప్రపోజ్ చేయడం, జీవితాంతం తోడుంటాని ప్రియుడితో చెప్పడంతో.. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. భోలె ఎలిమినేట్ ఓవైపు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతూనే నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో ఎవరు సేవ్ అయ్యారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది నాగ్ చెబుతూ వచ్చాడు. గౌతమ్, శివాజీ, రతిక సేవ్ అయిపోగా.. చివరగా యవర్, భోలె మిగిలారు. వీళ్లిద్దరూ భోలె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అయితే గత ఐదువారాలుగా తనకు తోడుగా ఉన్న భోలె వెళ్లిపోయేసరికి అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈరోజు ఎపిసోడ్లో రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్స్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టగా.. శ్రీలీల, కాజల్ తదితరులు సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. చివర్లో హైపర్ ఆది వచ్చి అందరూ గురించి చెబుతూ దడదడలాడించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?) -
బిగ్‌బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవగా అందులో ఒకరైన రతిక వైల్డ్ కార్డ్‌తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమె ఎంట్రీతో షోకు ఒరిగిందేమీ లేదు. పాత గొడవలు తవ్వుతూ కూర్చోవడంతో చిరాకొచ్చిన నాగార్జున ఆ సోదంతా ఇప్పుడెందుకు అని గతాన్ని వదిలెయ్మన్నాడు. సరేనంటూ బుద్ధిగా ఆయన చెప్పినట్లే నడుచుకుంది. కానీ ఆటలో మాత్రం చాలా వెనకబడిపోయింది. కనీసం తనేం చేస్తుందే తనకే తెలియనట్లుగా ప్రవర్తిస్తోంది. ఎలిమినేషన్‌కు ముందు ప్రశాంత్‌తో పులిహోర కలిపిన ఆమె ఈసారి ప్రిన్స్‌ను తనవైపుకు తిప్పుకుంది. పాతాళానికి రతిక గ్రాఫ్ దీనివల్ల రతికకు ఏమైనా కలిసొస్తుందే లేదో కానీ యావర్ ఆట, గ్రాఫ్ మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. ఈమె ఆడదు, ఇంకొకరిని ఆడనివ్వదంటూ జనాలు రతిక మాకొద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నారు. సోషల్ మీడియా పోలింగ్స్లోనూ రతిక చివరి స్థానంలో ఉంది. అంటే ఈమె ఎలిమినేట్ అవాలని జనాలు గట్టిగానే డిసైడ్ అయ్యారు. అటు ఫ్యామిలీ వీక్‌లో కూడా ఆమెకు, ఆమె తండ్రికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రతిక ఎలిమినేట్ కానుందేమో, అందుకే తనను లైట్ తీసుకుంటున్నారని నెటిజన్లు రకరాలుగా ఊహించుకున్నారు. (చదవండి: 'శోభన్ బాబుకు డబ్బులు ఇచ్చిన చంద్రమోహన్'.. ఎందుకంటే?) టాలెంట్ ఉంది కానీ.. కానీ తాజాగా మరో ఆసక్తికరవార్త నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ వారం భోలె షావళి ఎలిమినేట్ కానున్నాడట! ఇతడు కూడా పెద్దగా ఆడింది లేదు, కానీ పాటలతో ఇరగదీస్తున్నాడు. అప్పటికప్పుడు పాటలను అల్లుతూ అవలీలగా పాడేసే అతడి టాలెంట్‌కు జనాలు ఫిదా అవుతున్నారు. కానీ కొన్నిసార్లు సాగదీసి మాట్లాడటం, ఆటలో వెనుకబడటంతో తనకు కూడా తక్కువ ఓట్లే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం భోలె షావళి ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉల్టాపల్టా.. ఎలిమినేట్ అయ్యేది అతడేనా? మరి నిజంగానే భోలెకు తక్కువ ఓట్లు పడ్డాయా? అమ్మాయిలను కాపాడుకోవడానికి భోలెను బలి చేశారా? అనేది తెలియాల్సి ఉంది. అసలే ఈ సీజన్ అంతా ఉల్టాపల్టా.. తక్కువ ఓట్లు వచ్చిన రతికను లోనికి పంపించారు. బాగా ఆడే సందీప్‌ను బయటకు పంపించేశారు. ఎలిమినేట్ కావాల్సిన శోభను హౌస్‌లో ఉంచుతున్నారు. ఇంకా ఈ సీజన్లో ఎన్ని జరగుతాయో చూడాలి! చదవండి: గతంలో చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ.. ఉదయం సొమ్మసిల్లి పడిపోవడంతో.. టాలీవుడ్లో తీవ్ర విషాదం.. చంద్రమోహన్ కన్నుమూత -
బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్.. ఆ కంటెస్టెంట్‌కు శాపమైందా?
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్‌గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్‌ను పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్‌లో పంపి కంటెస్టెంట్స్‌ను ఏడిపించేశారు. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే మూడో రోజు కూడా హౌస్‌లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్‌కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్‌తో పాటు ఆడియన్స్‌ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్‌గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్‌లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశముంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్‌కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్‌లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్‌పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కంటెస్టెంట్స్‌ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. (ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..) -
ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్‌ను గెలిపించాలని బిగ్‌బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం సాధించేలా బిగ్‌బాస్ పావులు కదిపాడు. అసలు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తాజా(నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. ఆ టీమ్‌లోని అందరూ కంటెండర్లే బిగ్‌బాస్ బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని అడిగాడు. వీరసింహాలు టీమ్ తమ దగ్గరే ఉందని బదులిచ్చారు. ఈ నల్ల బంతి సాయంతో అవతలి టీమ్ దగ్గరున్న అన్ని బంతులను తీసుకోవచ్చని భలే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వీరసింహాలు టీమ్ సభ్యులు ఎగిరి గంతేశారు. కానీ గర్జించే పులుల టీమ్‌లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతులకు కక్కుర్తి పడ్డారు. అన్నీ ఇచ్చేయమన్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారని గౌతమ్ ప్రశ్నించగా మా ఇష్టమొచ్చినట్లు చేస్తామన్నాడు శివాజీ. దీంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక అన్ని బంతులు వీరసింహాలకే దక్కి పైచేయి సాధించడంతో ఆ టీమ్‌లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. రతికతో దూరంగా ఉండమన్న శివాజీ మరోవైపు రతికతో కాస్త దూరంగా ఉండమని యావర్‌ను హెచ్చరించాడు శివాజీ. మీ అతి చనువు జనాలకు నచ్చకపోవచ్చని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మధ్యలో వీరసింహాలు టీమ్ తమ సభ్యులైన భోలె షావళిని అవతలి టీమ్‌లోని అర్జున్‌తో స్వాప్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే తాను మొదట తేజ పేరు సూచించానని గౌతమ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావటగా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌతమ్.. భోలె దగ్గరకు వెళ్లి నేను డైరెక్ట్‌గా మీ పేరు చెప్పలేదు.. అది టీమ్ నిర్ణయం అని క్లారిటీ ఇచ్చాడు. స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకున్న ప్రిన్స్ అనంతరం బిగ్‌బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడో మెలిక పెట్టాడు. వీరసింహాలు టీమ్‌లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అవతలి టీమ్‌లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. అలాగే ఓ కంటెండర్ స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలె షావళి ఆటలో దూకారు. ఇదసలే ఫిజికల్ టాస్క్.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆటలో నుంచి వైదొలగాల్సింది. అయినా సరే తన ప్రతాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు. దెబ్బ తగలడంతో శివాజీ అవుట్ తీరా అక్కడ అందరూ లాక్కుని పీక్కునే క్రమంలో అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆటలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఆటలో అమర్దీప్- అశ్విని కొట్టుకున్నారు. బిగ్‌బాస్ గీసిన వృత్తంలో నుంచి అందరూ బయటకు వచ్చారని సంచాలకుడైన ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ గీత దాటి బయటకు వచ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడమన్నాడు అమర్దీప్. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడు. అమర్ సాయం.. కెప్టెన్‌గా శోభ ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి తరపున ఆడి, పోరాడి అమర్ గెలిచాడు. మొత్తానికి అమర్ సాయంతో ఈ సీజన్లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్‌గా అవతరించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్రయత్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు నీ దగ్గరున్న కాయిన్స్ ఎవరికి ఇస్తావు? అని అర్జున్ అడగడంతో చిర్రుబుర్రులాడింది శోభ. కామెడీ చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందని విసుక్కుంది. శివాజీపై ఫిర్యాదు తర్వాత గౌతమ్.. శివాజీ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివాజీ అన్న గేమ్‌ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధర్మం అని మాటలు చెప్తుంటాడు.. కానీ ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు. అవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆయన చేసేదంతా చేసి మళ్లీ ఏమీ ఎరుగనట్లు తప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయన కప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భరించలేకపోతున్నాను. నేను తప్పయితే నన్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: రాహుల్-రతిక పెళ్లి.. అతడు పెట్టిన కండీషన్స్ వల్లే బ్రేకప్! -
శోభ శెట్టి సేఫ్.. షాకిచ్చిన బిగ్ బాస్.. వారిద్దరిలో ఒకరు ఔట్
బిగ్‌బాస్ సీజన్ 7 సగం పూర్తి అయింది. ఎనిమిది వారాల తర్వాత తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పోతున్నాడు. మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, బోలే, సందీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. బిగ్ ఫైట్‌లో గెలిచిన శోభ బిగ్‌బాస్‌లో శివాజీ బ్యాచ్‌ను ఢీ కొట్టేది శోభ మాత్రమే కాబట్టి ఆమెను ఎలిమినేషన్ చేయాలనే ప్లాన్‌లో బయట ఉన్న శివాజీ పీఆర్ టీమ్ చాలా గట్టిగానే పోరాడింది. అలా శివాజీకి డప్పు కొట్టే బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది. కొందరైతే ఆమెపై ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా కామెంట్లు చేయడం దారుణం. నామినేషన్ లిస్ట్‌లో శోభ పేరు చేరగానే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరకు బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యుడిలా వెళ్లి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దగ్గరైన ఆదిరెడ్డి కూడా శివాజీ బ్యాచ్‌లోని సభ్యులకే ఎక్కువ సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆదిరెడ్డి కూడా.. హౌస్‌లో శివాజీ చేస్తున్న పొలంగట్టు పంచాయితీలనే వెనుకేసుకొస్తున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో మినహా శివాజీ బ్యాచ్‌నే ఆదిరెడ్డి కూడా వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు ఏ చిన్న తప్పులు చేసినా.. వాటిని ఆదిరెడ్డి కూడా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిరెడ్డికి మంచి ఆదరణ ఉంది. అతనికంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతను చెప్పే ప్రతి మాటకు ప్రస్తుతం ఒక వ్యాల్యూ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎక్కువగా శివాజీ బ్యాచ్‌నే వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివాజీ బ్యాచ్ సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. తన ఆటతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భోలే కూడా శివాజీ బ్యాచ్ అండతో సేఫ్ అవుతున్నాడు. ఎందుకు సేఫ్ కొన్నిసార్లు ఆటలో శోభ కూడా తప్పులు చేసి ఉండవచ్చు.. ఆమెతో పాటు శివాజీ బ్యాచ్ కూడా ఎన్నో తప్పులు చేశారు. ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నయ్. వాటంన్నిటినీ ఆమె మళ్లీ తిప్పికొట్టింది. హౌస్‌లో నిలిచింది. శివాజీ బ్యాచ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు. శివాజీ టీమ్‌ను శోభ మాత్రమే ఢీ కొడుతుంది. అలాంటిది ఆమెను హౌస్ నుంచి పంపిస్తే ఆటలో మజా ఉండదు. షో రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. శోభ కూడా ఆటలో ఫైట్ చేస్తుంది. రెచ్చగొడుతుంది.. అప్పుడే ఏడుస్తుంది. కానీ ఏ టాస్కులనూ వదలదు. తన శక్తిమేరకు పోరాడుతుంది. ఏదేమైన ఆటలో ఉండాల్సిన కేరక్టర్ శోభ అని చెప్పవచ్చు. శివాజీ బ్యాచ్ అండతో ఆయన సేఫ్ ఎనిమిదో వారం బిగ్‌బాస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేషన్ జరిగిపోయింది.. దాదాపు ఇదే ఖాయం. మొదటి వారంలోనే లక్కీగా ఐదు వారాలు ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొందాడు. ఇదే అతనికి బిగ మైనస్ అయింది. ఓట్లు వేసే వాళ్లు అతనికి చేరవు కాకుండా చేసింది. ఏడు వారల తర్వాత ఆయన ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉండటంతో ఓట్లు వేసే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు. ఆటలో మరీ అంత బ్యాడ్ పర్ఫామెన్స్ సందీప్ ఇవ్వలేదు. కానీ శివాజీ బ్యాచ్ కాదు.. శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను బయట ఉండే వారు క్రియేట్ చేశారు. ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్గానే ఉన్నాడు. కానీ చివరకు ఔటవ్వక తప్పలేదు. వాస్తవానికి ఈ వారం లక్కీ పర్సన్ భోలే.. ఆతను శివాజీ బ్యాచ్‌లో చేరడం వల్లే సేఫ్ అయ్యాడు. మరోవైపు శివాజీ టీమ్‌కు శత్రువు అయిన శోభతో వైరం క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది. -
ఎవరెన్ని వెధవ ప్రయత్నాలు చేసినా కప్పు కొట్టుకునే పోతా: అమర్
వారాలు గడిచేకొద్దీ, హౌస్‌లో జనం పలుచబడే కొద్దీ నామినేషన్స్ రసవత్తంగా మారుతున్నాయి. ఈ వారం కూడా నామినేషన్స్‌తో ఇంటిసభ్యుల మధ్య మంట పెట్టేశాడు బిగ్‌బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్లీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈ రోజు కూడా అది కొనసాగేట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మధ్యలో దూరిన శివాజీ.. గౌతమ్‌ను మళ్లీ ఇరిటేట్ చేశాడు. గౌతమ్‌తో పాటు అమర్‌దీప్‌ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్- అమర్ల మధ్య వార్ నడుస్తుంటే సందులో సడేమియాలా భోలె షావళి కలుగజేసుకున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన అమర్.. మధ్యలో వస్తే పగిలిపోద్ది.. అంటూ అక్కడున్న కుర్చీని తన్నాడు. అయినా సరే శివాజీ కలగజేసుకుంటూ నీకు అవసరం అయినప్పుడు ఒకలా మాట్లాడతావ్.. అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడతావా? అని అడిగాడు. విశ్వరూపం చూపించిన అమర్ అప్పటికే కోపంతో ఊగిపోతున్న అమర్.. మీరు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే చేసేయండి అని బదులిచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని ఎంత వెధవ ప్రయత్నాలు చేసినా కప్పుతోనే పోతా.. ఐయామ్ బ్యాక్ అని తన విశ్వరూపం చూపించాడు అమర్. అటు శోభా శెట్టి- భోలె షావళిల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. తేజ- అశ్విని మధ్య సైతం ఫైట్ జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్స్‌తో కంటెస్టెంట్ల మధ్య ఆరని చిచ్చు పెట్టేశాడు బిగ్‌బాస్. చదవండి: హీరోతో లవ్‌లో ఉన్న యాక్షన్ కింగ్ కూతురు -
బిగ్‌బాస్: నామినేషన్స్‌లో ఏడుగురు, ఆ కంటెస్టెంట్ మాత్రం నయా రికార్డు!
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరూ వెళ్లేకొద్దీ నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్లో వరుసగా ఏడుగురు అమ్మాయిలను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. అయితే రతికను మాత్రం తిరిగి హౌస్‌లోకి పంపించారు. ఇకపోతే గతవారం భోలె షావళి బూతులు మాట్లాడుతూ అందరికీ బీపీ తెప్పించాడు. వీకెండ్ ఎపిసోడ్‌లోనూ నాగ్ క్లాస్ పీకాడు. ఇప్పుడదే వ్యవహారాన్ని నామినేషన్ అస్త్రంగా మార్చుకున్నాడు శివాజీ. భోలె తప్పులు మాట్లాడాడు. కానీ అతడు సారీ చెప్పినా క్షమించకపోవడం తప్పంటూ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. అర్హత లేదు, బయటకు వెళ్లు మాటలు పడింది తాను.. క్షమించడం, క్షమించకపోవడం తన ఇష్టమని శోభా అభిప్రాయపడింది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నన్ను నెగెటివ్‌గా చూపించేందుకు ఇదే మంచి అవకాశం అనుకున్నారంటూ శివాజీ కుట్రను బయటపెడుతూ అతడి మీద ఫైర్ అయింది. ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, బయటకు వెళ్లు అని చెప్తున్నారు.. అంతే కదా అని నిలదీసింది. దానికి శివాజీ.. నాతో సహా ఇక్కడున్న ఎవరికీ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ తలతిక్క సమాధానం ఇచ్చాడు. ఏడుగురు నామినేట్ ఇక రోజు కూడా భోలె షావళి- ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగేట్లు కనిపిస్తోంది. కాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం శివాజీ, భోలె షావళి, అమర్దీప్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్.. మొత్తంగా ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి కూడా సందీప్ నామినేషన్స్‌లోకి రాకపోవడం గమనార్హం. వరుసగా ఎనిమిది వారాలుగా సందీప్ నామినేషన్స్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఈ లెక్కన ఎక్కువ వారాలు నామినేట్ అవని కంటెస్టెంట్‌గా సందీప్ రికార్డు సృష్టిస్తున్నాడు. చదవండి: వారిని ఎలిమినేట్ చేయాల్సిందన్న పూజా మూర్తి... గీతూ కౌంటర్లకు దండం పెట్టేసిందిగా -
బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ
బిగ్ బాస్ ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఎప్పిటిలాగే ఈ వారం కూడా హౌస్‌లో నామినేషన్స్ రచ్చ భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం చూస్తే ఈసారి శివాజీని శోభ ఢీ కోట్టినట్లు కనిపిస్తుంది. గతవారంలో శోభ- ప్రియాంకల మీద బూతు పదాలతో భోలే షావాలి విరుచకపడ్డాడు. దీంతో వారిద్దరూ కూడా అదే రేంజ్లో తిప్పికొట్టారు. దీనిని తప్పుబడుతూ శోభను నామినేషన్ చేస్తున్నట్లు శివాజీ చెప్పాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌తో గౌతమ్ నామినేషన్ వాగ్వాదం నడిచింది. హౌస్‌లో ఆడపిల్లలపై బూతులు.. సమర్థించిన శివాజీ శోభ- ప్రియాంకలపై గతవారంలో భోలే షావాలి బూతు మాటలు అన్నాడు. ఆ మాటలు తెలంగాణ మాండలికంలో అత్యంత దారుణమైనవి. అది గమనించిన ప్రియాంక శోభకు తెలిపి వెంటనే రియాక్ట్ అయ్యారు. తూ... అంటూ భోలేపై ప్రియాంక విరుచుకుపడింది. ఆపై వెంటనే ప్రియాంక క్షమాపణ కోరింది. కానీ బూతు మాటలు మాట్లాడిన భోలే అప్పటికి కనీసం క్షమాపణ కూడా కోరలేదు. కొంత సమయం తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాక భోలే క్షమాపణలు కోరాడు. ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడే ఉన్న వేరే లేడీ కంటెస్టెంట్లు గానీ, మేల్ కంటెస్టెంట్లు గానీ కిక్కుమనలేదు. అన్నింట్లో వేలు పెట్టే శివాజీ కూడా భోలేను ఒక్కమాట అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం భోలే చేసింది తప్పే అంటూ కలరింగ్ ఇస్తున్నాడు శివాజీ. పైగా నేడు ఇదే గొడవను మళ్లీ తెరపైకి తెచ్చి శోభను నామినేట్ చేశాడు. అదే బూతు పదం శివాజీ కుటుంబ సభ్యులను అంటే తీసుకుంటాడా..? సారీ చెబితే సంతోషిస్తాడా..? వాళ్లిద్దరూ కూడా ఆడపిల్లలు.. భోలే మాటలకు కన్నీరు పెట్టలేదు. శివంగుల్లా తిరగబడ్డారు. తన మనసులో ఏదైతే ఉందో అదే బయటకు చెప్పారు. భోలేను క్షమిస్తున్నారా అని నాగార్జున అడిగినా.. లేదు సార్ అని చెప్పారు. అంతలా భోలే మాటలు వారిని బాధించాయి. కనీసం ఈ సోయ కూడా లేకుండా శోభ పేరును శివాజీ ఎలిమినేషన్ ప్రక్రియలో చేర్చాడు. దీంతో భోలే వాడిన బూతులను శివాజీ సమర్థించినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా పట్టని కొన్ని పీఆర్ టీమ్ వాల్లు కావాలని తెలుగు వెబ్సైట్లతో ఆమె మీద వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఒక ఆడపిల్లను అంత మాట అనేశాడే అనే సోయ కూడా లేకుండా భోలే,శివాజీ లాంటి వారి కోసం పీఆర్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అయినా సరే ఆమె మరింత గట్టిగా ఆటలో నిలబడుతోంది. -
నా కుమారుడిని అలా చేస్తారనుకోలేదు.. ఏడ్చేసిన భోలె షావళి తల్లి
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్ కళకళలాడిపోయింది. అటు నామినేషన్స్ కూడా మరింత వాడివేడిగా జరిగాయి. ఈ వారం జరిగిన నామినేషన్స్ అయితే పీక్స్‌కు వెళ్లిపోయాయి! భోలె షావళి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడా వాయించేయడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రియాంక అతడిని థూ అని చీదరించుకుంది. నా కొడుకుది ఎంతో మంచి గుణం తాజాగా ఈ నామినేషన్స్ రచ్చపై భోలె షావళి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా ఆమె తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'అంత మంచి మనసున్నవాడు, పది మందికి అన్నం పెట్టే వాడిని హౌస్‌లో అలా చేస్తారనుకోలేదు. నా కొడుకును ప్రియాంక థూ అని ఎందుకు అన్నదో అర్థం కావట్లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎంతో మంచి గుణం వాడిది. అతడితో హౌస్‌లో ఎవరూ మాట్లాడట్లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు' అంటూ ఏడ్చేసింది. సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది భోలె చెల్లి మాట్లాడుతూ.. 'మా అన్నయ్య అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. తనకు అతిగా మాట్లాడే అలవాటు లేదు. తనకు నటించడం రాదు. సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక థూ.. అనేంత తప్పు తనేం చేశాడు. శోభా శెట్టి తన మీద పడి అరిచేస్తోంది. అంత అవసరం లేదు. ఆ ఎపిసోడ్ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం. శోభా, ప్రియాంక.. హౌస్‌లో మొదటి నుంచి ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. ఓవరాక్షన్ చేస్తున్నారు. సీరియల్స్‌లో నటించినందుకు వారికి ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ థూ అని ఊసేంత తప్పు మా అన్నయ్య ఏమీ చేయలేదు. తను ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టినా మా అన్నయ్య మాత్రం కూల్‌గానే మాట్లాడాడు' అని ఫైర్ అయింది. చదవండి: యంగ్ టైగర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు! -
భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!
బిగ్‌బాస్ ఎపిసోడ్ చూస్తుంటే అయితే ఎంటర్టైన్మెంట్ లేదంటే విసుగొస్తుంది. కానీ చిరాకు మాత్రం రాదు. అయితే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ వల్ల అదే జరిగింది. హౌసులో గలీజుగా బూతులు మాట్లాడాడు. అది కూడా ఆడపిల్లల ముందు. పైగా దానికో పిచ్చి సమర్ధన. ఇదంతా కూడా మంగళవారం నామినేషన్స్ సందర్భంగా జరిగింది. ఇంతకీ తాజాగా ఏం జరిగిందనేది Day 44 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బయటకొచ్చిన మోనిత ఏడుగురు తమ తమ నామినేషన్స్ పూర్తి చేయడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తొలుత వచ్చిన శోభా.. భోలెని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే టాస్కులో 'ఆడపిల్ల కాబట్టి వదిలేశాను' అనే స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు? అని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పింది. అయితే కుండ పగలగొట్టని చెప్పాలి లేదంటే డిఫెండ్ చేయాలి కానీ.. 'నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా' అని కామెడీ చేశాడు. నువ్వు మోనిత కావొద్దని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పదేపదే మోనిత అనే పేరు ప్రస్తావిస్తూ.. వింత వింత సామెతలన్నీ చెబుతూ పిచ్చెక్కించాడు. (ఇదీ చదవండి: విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శోభాశెట్టి - తేజ, భోలె శివాజీ - గౌతమ్, అమరదీప్ అశ్విని - పూజామూర్తి, అర్జున్ గౌతమ్ - భోలె, శివాజీ భోలె - శోభాశెట్టి, ప్రియాంక యవర్ - గౌతమ్, అమరదీప్ భోలె బూతు పురాణం అయితే శోభాశెట్టి నామినేట్ చేస్తున్న టైంలో భోలె ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అని ప్రియాంక అనగానే.. 'ఆగమ్మ కాసేపు ఆగు' అని మరింత ఇరిటేషన్ తెప్పించాడు. మధ్యలో 'మా రైతుబిడ్డ' అని చెప్పి ప్రశాంత్ ఫ్యాన్స్ సింపతీ కొట్టేద్దామని చూశాడు. మధ్యలో ఎంటరైన శోభా.. ప్రేమ చూపించి, ప్రశాంత్ ఫ్యాన్స్ ఓట్లు కొట్టేద్దామనుకుంటున్నారా? అని భోలె ఆలోచన బయటపెట్టి, కడిగిపారేసింది. దీంతో వచ్చే వారమే వెళ్లిపోతా, రాస్కో అని భోలె బరస్ట్ అయిపోయాడు. అంత సీరియస్‌గా గొడవ జరుగుతుంటే.. 'ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది' అని ఏదేదో మాట్లాడాడు. ఇక కాసేపటి తర్వాత స్పందించిన బిగ్‌బాస్.. బూతులు మాట్లాడటం ఆపేయకపోతే సహించేది లేదని అన్నాడు. (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) మళ్లీ శోభా vs భోలె ఇక భోలె తన నామినేషన్స్‌లో భాగంగా శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు. కానీ సరైన కారణాలు చెప్పలేకపోయాడు. అలా అని వాళ్లతో వాదించనూ లేకపోయాడు. మధ్యలో 'నీకు ఎర్రగడ్డే దిక్కు' అని శోభాతో అన్నాడు. దీంతో ఆమె మళ్లీ రెచ్చిపోయింది. అయితే బూతులు మాట్లాడటం తనకు ఊతపదం అని ఏదో చెప్పుకొచ్చాడు కానీ అది ఏ మాత్రం కరెక్ట్‌గా అనిపించలే. ఈ వారం నామినేట్ అయింది వీళ్లే భోలె అశ్విని తేజ ప్రశాంత్ పూజా అమరదీప్ గౌతమ్ అయితే భోలెని సరిగ్గా పరిశీలిస్తే ఓ విషయం క్లియర్‌గా అర్థమైంది. రైతుబిడ్డ అనే పేరుని పోలినట్లు పాటబిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని సింపతీ కొట్టేద్దామనుకున్నాడు. అలానే శివాజీలా మంచి మాటలు చెబుతూ.. హౌసులో ఉండిపోదామనుకున్నాడు. కానీ వచ్చిన రెండోవారానికే భోలె నిజస్వరూపాన్ని ప్రియాంక, శోభాశెట్టి బయటపెట్టేశారు. దీనికి తోడు బూతులు మాట్లాడటంతో భోలె తన పరువు తానే తీసుకున్నట్లు అయింది. మరి ఇలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంటాడా? ఎలిమినేట్ అయిపోతాడా అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) -
'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటిరోజే ఏడుగురు నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన వారు ఈ రోజు జరిగే ఎపిసోడ్లో నామినేట్ చేయనున్నారు. తాజాగా ఈ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ప్రోమోలో శోభాశెట్టి మాట్లాడుతూ..'తేజ నువ్వు పనిష్మెంట్ అనేది చాలా సిల్లీగా తీసుకుంటున్నావ్. ఈరోజు కూడా వెళ్తా. నేను వీఐపీ గదిలోనే ఉంటా. అది నా ఇష్టం' అని చెప్పింది. దీనికి టేస్టీ తేజ రిప్లై ఇస్తూ.. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ బ్రో అని చెప్పాడు. ప్రతిదీ నీకు ఫన్.. కానీ మాకే సీరియస్‌గా అనిపిస్తోందని చెప్పింది శోభాశెట్టి. (ఇది చదవండి: ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా) ఆ తర్వాత ప్రియాంక జైన్, శోభాశెట్టిని ఉద్దేశించి.. 'మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తోందిరా? ఆడపిల్లలు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది అని భోలె షావలి కాస్తా వెటకారంగా' అన్నారు. దీనికి కోపం తెచ్చుకున్న ప్రియాంక జైన్.. 'ఆడపిల్ల అంటూ నటించినవ్ కదా.. ఇంతసేపు కనిపిస్తోంది' అంటూ భోలే షావలిపై మండిపడింది. ఆ తర్వాత నీలాంటోళ్లను చాలామందిని చూసినా అని భోలె షావలి అనడంతో.. కోపంతో ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత షావలి అరే ఎంత మంచిగా ఉన్నా నేను' అంటాడు. కానీ ప్రియాంక్ మాట్లాడుతూ..'నువ్వు నటించావ్' అంటుంది. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ.. 'పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ టంగ్ అంటూ భోలె షావలికి వార్నింగ్ ఇస్తుంది'. అనంతరం తూ.. అని ప్రియాంక జైన్ అనడంతో.. నేను అదే తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలా? అంటాడు భోలె షావలి. ఆ తర్వాత శోభాశెట్టి అతన్ని నామినేట్ చేస్తూ కుండ పగలగొడుతుంది. ఇక టేస్టీ తేజ శోభాశెట్టితో మాట్లాడుతూ.. రూమ్‌లో ఉన్న వాళ్లందరు నామినేట్ చేయడం ఒక ఎత్తు.. నువ్వు నా కుండ పగలగొట్టడం ఒక ఎత్తు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోవడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ మరింత హీటెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు సీరియస్‌గా విమర్శలు చేసుకుంటూ మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ప్రోమో చూస్తే ఓవరాల్‌గా ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేయనున్నారు. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్) -
పాటతో నాగార్జుననే ఫిదా చేసిన భోలె షావళి
'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్‌లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్ సృష్టించిన భోలె షావళి సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. పెనుకొండ ముద్దుబిడ్డ అయిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్‌గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్‌తో మాయ చేసేందుకు బిగ్‌బాస్ షోకి వచ్చాడు. వచ్చీరాగానే నాగార్జునపై ఓ పాట పాడి హోస్ట్‌ను ఇంప్రెస్ చేశాడు. మరి తన మ్యూజిక్ మ్యాజిక్ ఇంట్లో పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి.