వారాలు గడిచేకొద్దీ, హౌస్‌లో జనం పలుచబడే కొద్దీ నామినేషన్స్ రసవత్తంగా మారుతున్నాయి. ఈ వారం కూడా నామినేషన్స్‌తో ఇంటిసభ్యుల మధ్య మంట పెట్టేశాడు బిగ్‌బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్లీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈ రోజు కూడా అది కొనసాగేట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది.
మధ్యలో దూరిన శివాజీ..
గౌతమ్‌ను మళ్లీ ఇరిటేట్ చేశాడు. గౌతమ్‌తో పాటు అమర్‌దీప్‌ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్- అమర్‌ల మధ్య వార్ నడుస్తుంటే సందులో సడేమియాలా భోలె షావళి కలుగజేసుకున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన అమర్.. మధ్యలో వస్తే పగిలిపోద్ది.. అంటూ అక్కడున్న కుర్చీని తన్నాడు. అయినా సరే శివాజీ కలగజేసుకుంటూ నీకు అవసరం అయినప్పుడు ఒకలా మాట్లాడతావ్.. అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడతావా? అని అడిగాడు.
విశ్వరూపం చూపించిన అమర్
అప్పటికే కోపంతో ఊగిపోతున్న అమర్.. మీరు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే చేసేయండి అని బదులిచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని ఎంత వెధవ ప్రయత్నాలు చేసినా కప్పుతోనే పోతా.. ఐయామ్ బ్యాక్ అని తన విశ్వరూపం చూపించాడు అమర్. అటు శోభా శెట్టి- భోలె షావళిల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. తేజ- అశ్విని మధ్య సైతం ఫైట్ జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్స్‌తో కంటెస్టెంట్ల మధ్య ఆరని చిచ్చు పెట్టేశాడు బిగ్‌బాస్.
Comments
Please login to add a commentAdd a comment