బిగ్‌బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్‌తో పదోవారం ముగిసింది. గత తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది హౌస్ నుంచి బయటకెళ్లిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ నడిచింది. అయితే అందరూ రతిక ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అనుహ్యంగా భోలె ఎలిమినేట్ అయిపోయాడు. పాడ పాడుతూ, నవ్వుకుంటూ హౌస్ నుంచి బయటకొచ్చేశాడు.
భోలె ఎలిమినేట్
ఈ వారం ఎలిమినేషన్.. రాజమాతలు అనే కాన్సెప్ట్ ప్రకారం జరిగింది. దీంతో అమ్మాయిలందరూ రాజమాతల్లా ఉండి ఎవరూ నామినేట్ కావాలనేది డిసైడ్ చేశారు. అలా శివాజీ, గౌతమ్, యవర్, భోలె, రతిక.. ఎలిమినేషన్స్‌లో నిలిచారు. ఇందులో ఎప్పటిలానే శివాజీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో యవర్, గౌతమ్ నిలిచారు. చివరి రెండు స్థానాల్లో రతిక-భోలె మధ్య కాస్త నడిచింది. కానీ భోలెపై వేటు పడింది. మరో ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు.
(ఇదీ చదవండి: Bigg Boss 7: లవ్‌స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?)
సంపాదన గట్టిగానే
వైల్డ్‌కార్డ్ కోటాలో పాటబిడ్డ అనే ట్యాగుతో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. ఆట కంటే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ గేమ్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. శివాజీ బ్యాచులో ఉండటం, కాస్త ఎంటర్‌టైన్ చేయడంతో దాదాపు ఐదు వారాలు ఎలాగోలా బండి లాక్కుంటూ వచ్చేశాడు. అలానే అమ్మాయిలతో గొడవ, బూతులు మాట్లాడటం లాంటివి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేషన్స్‌లోనూ అందరూ మనోడి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేసరికి భోలెపై వేటు తప్పలేదు.
ఇకపోతే భోలె.. రోజుకు రూ.35 వేల చొప్పున అంటే వారానికి దాదాపు రూ.2.5 లక్షల లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కేసుకుంటే ఐదు వారాలకుగానూ రూ.12 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఇప్పటివరకు భోలెనే కాస్త ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు లెక్క. ఏదైతేనేం మనోడు వచ్చిన తొలివారంలో చెప్పినట్లు ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నాడు. మంచిగా సంపాదించి, కాస్త పేరు తెచ్చుకుని హౌస్ నుంచి వెళ్లిపోయాడు.
(ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్)
Comments
Please login to add a commentAdd a comment