అతను రైతుబిడ్డ.. నేను పాటబిడ్డ.. శివాజీని ఎప్పుడలా చూడలేదు! | Bhole Shavali Reacts To Rumours About That He Is Supporting Pallavi Prashanth And Shivaji In Bigg Boss House - Sakshi
Sakshi News home page

Bhole Shavali: 'అలాంటి ఐడియా నాకే రాలేదు.. అందుకే సపోర్ట్ చేశా..'

Published Wed, Nov 15 2023 2:05 PM | Last Updated on Thu, Nov 16 2023 5:09 PM

Bhole Shavali Comments About Support To Pallavi Prashanth - Sakshi

బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పదకొండో వారానికి చేరుకున్న తెలుగువారి రియాలిటీ షో ఈసారి మరింత సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భోలె షావలి పదో వారం ఎలిమినేట్ అయ్యారు. హోస్‌లో ఉన్నది కొద్ది వారాలే అయినా.. తన పంచ్‌లు, పాటలతో అందరినీ అలరించాడు. అయితే హౌస్‌లో ఉన్నన్ని రోజులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌గా నిలిచాడనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్‌ నుంచి బయటకొచ్చిన భోలె షావలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్‌, శివాజీకి మద్దతుగా ఉన్నారన్న విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటో చూద్దాం. 

భోలె షావలి మాట్లాడుతూ..' నేను వైల్ట్‌ కార్డ్‌పై హౌస్‌లోకి వెళ్లా. కానీ నేను ప్రశాంత్ బిగ్‌ బాస్‌లోకి వెళ్లకముందే అతని వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నా. ఇది చూసిన ప్రశాంత్ క్లోజ్ ఫ్రెండ్‌ గన్ను అనే వ్యక్తి నన్ను అడిగాడు. సార్.. మీరు ఏంటి ఇలా పెట్టారని అడిగాడు. అవును.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకే ఆలాంటి ఐడియా రాలేదు. అలాంటిది అతను పోరాడుతుంటే ప్రోత్సహించడం నా ధర్మం అని చెప్పా. కట్ చేస్తే ఇద్దరం బిగ్‌బాస్‌లో ఉన్నాం. అతను రైతు బిడ్డ.. నేను పాట బిడ్డ అంతే. కానీ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. శివాజీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. ఆయన పెద్ద నటుడిగా ఉండి.. బిగ్‌ బాస్‌కు వెళ్లడమే గొప్ప. అంతే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను అలా మారిపోయా. ఆయనను కంటెస్టెంట్‌గా ఎప్పుడూ చూడలేదు. శివాజీని ఒక హీరోలాగానే చూశాను. కానీ నేను హీరో ‍అవుతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. భోలె షావలి బిగ్‌బాస్‌లో తన మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement