బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్‌ఫుల్‌గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. అలానే కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. ఈ షో సాక్షిగా తన ప్రియుడ్ని పరిచయం చేసింది. వాళ్ల లవ్‌స్టోరీ కూడా మొత్తం బయటపడింది. ఓ మాదిరి ఎంటర్‌టైనింగ్‌గా సాగిన ఈ ఎపిసోడ్ లో ఓవరాల్‌గా ఏం జరిగిందనేది Day 70 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?)
దీపావళి గేమ్‌తో షురూ
ఈ ఆదివారం దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ కళకళలాడింది. హౌస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ అందరూ నిండుగా ముస్తాబై వచ్చారు. 'ఫైండ్ ద క్రాకర్' అనే చిన్న పోటీతో ఎపిసోడ్ మొదలైంది. ఈ గేమ్ లో ప్రియాంక-అమరదీప్ జోడీ గెలిచింది. దీని తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి ఫ్యామిలీ మెంబర్స్-ఫ్రెండ్స్ స్టేజీపైకి వచ్చారు. హౌస్‌మేట్స్ అందరితోనూ మాట్లాడుతూ ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఇంకా మెరుగవ్వాలి అని సలహాలు ఇచ్చారు. అలానే ఆయా కంటెస్టెంట్ కి సపోర్ట్‌గా వచ్చినవాళ్లు ఓవరాల్ టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు.
ఈసారి టాప్-5 వాళ్లే
ఇకపోతే అమరదీప్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి శోభాశెట్టి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతూ ఎవరైతే ఈసారి టాప్-5లో ఉండొచ్చనేది గెస్ చేశారు. అయితే ఓవరాల్ లిస్టు చూసుకుంటే ప్రతిఒక్కరూ శివాజీకి ఏదో ఓ స్థానంలో పెట్టారు. దీంతో అతడికి 11 ఓట్లు పడ్డాయి. ఇతడి తర్వాత ప్రశాంత్‌కి 7, అమరదీప్-ప్రియాంకకు చెరో 6, గౌతమ్‌కి 5 ఓట్లు పడ్డాయి. మిగిలిన హౌస్‌మేట్స్‌కి ఒకటి రెండు ఓట్లు పడ్డాయంతే. దీనిబట్టి చూసుకుంటే.. ఈసారి టాప్-5లో శివాజీ, ప్రశాంత్, అమరదీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయపడ్డారు.
(ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్)
శోభా లవర్ ఆగయా
దీపావళి ఎపిసోడ్‌కి ఆయా హౌస్‌మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా! శోభా కోసం మాత్రం ఆమె తండ్రితో పాటు బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి వచ్చాడు. అలా శోభా-యశ్వంత్.. బిగ్‌బాస్ సాక్షిగా తమ ప్రేమకథని బయటపెట్టారు. దాదాపు మూడన్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలానే శోభానే తొలుత ప్రపోజ్ చేసిందని, యశ్వంత్ బయటపెట్టాడు. 'నీకు నేను లైఫ్ లాంగ్ ఉంటాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీ కష్టాల్లో, సుఖాల్లో తోడుంటాను, నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా తోడుంటాను, పెళ్లి చేసుకుందాం అని అడిగింది. దీంతో నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ తను చెప్పిన తర్వాత ఓకే అన్నాను' అని శోభా బాయ్‌ఫ్రెండ్ మొత్తం విషయాన్ని చెప్పాడు. అయితే రఫ్ అండ్ టఫ్ గా ఉండే శోభా.. ముందే తానే ప్రపోజ్ చేయడం, జీవితాంతం తోడుంటాని ప్రియుడితో చెప్పడంతో.. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
భోలె ఎలిమినేట్
ఓవైపు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతూనే నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో ఎవరు సేవ్ అయ్యారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది నాగ్ చెబుతూ వచ్చాడు. గౌతమ్, శివాజీ, రతిక సేవ్ అయిపోగా.. చివరగా యవర్, భోలె మిగిలారు. వీళ్లిద్దరూ భోలె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అయితే గత ఐదువారాలుగా తనకు తోడుగా ఉన్న భోలె వెళ్లిపోయేసరికి అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈరోజు ఎపిసోడ్‌లో రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్స్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టగా.. శ్రీలీల, కాజల్ తదితరులు సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. చివర్లో హైపర్ ఆది వచ్చి అందరూ గురించి చెబుతూ దడదడలాడించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయింది.
(ఇదీ చదవండి: Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?)
Comments
Please login to add a commentAdd a comment