బిగ్‌బాస్ షోలో ప్రతివారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతుంటారు. సోమవారం నామినేషన్స్ పూర్తవగానే.. బయటకెళ్లేది ఎవరనేది ప్రేక్షకులు గెస్ చేస్తుంటారు. ఈ సీజన్‌లో దాదాపు అన్నిసార్లు అది నిజమైంది కూడా. ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. పాటబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన సింగర్, మ్యూజిక్ కంపోజర్ భోలె షావళి ఎలిమినేట్ అయిపోయాడు. ఇలాంటి చిత్రమైన క్యారెక్టర్ ఎలిమినేట్ కావడానికి కారణాలు చాలానే ఉన్నాయనిపిస్తోంది.
కాపీ కొట్టడం శాపమైందా?
వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌసులోకి వచ్చిన భోలె.. తనని తాను పాటబిడ్డగా పరిచయం చేసుకున్నాడు. అయితే అప్పటికే హౌసులోకి రైతుబిడ్డ ట్యాగ్‌తో ప్రశాంత్ ఉన్నాడు. పాటబిడ్డ అనే పేరు ప్రశాంత్‌ని చూసి కాపీ కొట్టినట్లు అనిపించింది. ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉండిపోదామని వచ్చానని ఓ సందర్భంలో భోలె అన్నాడు. అది కూడా శివాజీ బిహేవియర్‌ని కాపీ కొట్టినట్లు అనిపించింది తప్పితే కొత్తగా ఏం అనిపించలేదు. ఈ రెండు విషయాల్లోనూ డిఫరెంట్ అప్రోచ్‌తో భోలె వచ్చుండాల్సింది.
మాట, పాట తేడా కొట్టాయా?
స్వతహాగా సింగర్ అయిన భోలె.. బిగ్‌బాస్‌లో ఉన్నన్నిరోజులు మాట్లాడినప్పుడు గానీ ఎవరైనా తనని నామినేట్ చేసినప్పుడు గానీ విచిత్రంగా ప్రవర్తించేవాడు. స్ట్రెయిట్‌గా సమాధానం ఇవ్వకుండా ఏదో పాడుతూ, అర్ధం లేకుండా మాట్లాడుతూ అందరికీ మెంటల్ ఎక్కించేసేవాడు. ఇవన్నీ కాదన్నట్లు వచ్చిన వెంటనే శివాజీ బ్యాచులో కలిసిపోయాడు. దీంతో సీరియల్ బ్యాచ్‌కి టార్గెట్ అయిపోయాడు. ఈ వారం మహారాణులు తీర్మానంతో ఐదుగురిలో ఒకడిగా భోలె నామినేట్ అయ్యాడు. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాడు. సో అదన్నమాట విషయం.
Comments
Please login to add a commentAdd a comment