బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడానికి వస్తే తమను అసభ్య పదజాలంతో దూషించాడని కొందరు యాంకర్లు ప్రశాంత్ మీద ఆరోపణలు చేశాడు. తనను కావాలని నెగెటివ్ చేస్తున్నారంటూ అరెస్టుకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాజాగా ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
జనం కోసం ఆడాలి..
'అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్‌లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్‌లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వరకు తీసుకెళ్లండి.
ఆనందంలో ఏం చేశాడో తెలియలేదు
లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్‌కు తెలియదు. అభిమానులు చాలామంది వచ్చారు. ఇంతమంది ఓటేస్తే గెలిచానన్న ఆనందంలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియలేదు. ఆయన నేరం చేయలేదు. టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలైతే ఆయన ఎంత మానసిక క్షోభ పడతాడు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్‌ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు.
చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత!
Comments
Please login to add a commentAdd a comment