ఇండియన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎవరో చెబితే తాను ఫాలో కానని.. నటుడిగా సామాజిక బాధ్యతను తాను నిర్వహిస్తానని అన్నారు. బెటర్ సోసైటీ కోసం ఎప్పుడు సినీ పరిశ్రమ కృషి చేస్తోందని ఆయన అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
డ్రగ్స్ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వానికి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని సిద్ధార్థ్ అన్నారు. మన పిల్లల భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని తెలిపారు. వారి కాపాడాల్సిన బాధ్యత మనందరిదని తెలిపారు. బెటర్ సొసైటీ కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ ఇండస్ట్రీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. నా కెరీర్‌లో సామాజిక బాధ్యతను తనవంతుగా భావిస్తానని పేర్కొన్నారు. కాగా.. సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించిన ఇండియన్-2 జూలై 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే.
అంతకుముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతూ..'నా పేరు సిద్ధార్థ్. నేను 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నా.. తెలుగు సినిమాలో ఒక చేతిలో కండోమ్ పట్టుకుని బిల్ బోర్డ్స్‌లో నా ఫోటో వచ్చేలా గతంలోనే ప్రభుత్వానికి సహకరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 నుంచి 2011 వరకు ఎక్కడా హోర్డింగ్ కనిపించినా కండోమ్ పట్టుకుని మీకు సిద్ధార్థ్ కనిపిస్తాడు. ఆ సామాజిక బాధ్యత నాది. ఒకరు చెబితే నాకు గుర్తుకు రాదు. ఎవరైనా చెప్తే చేయాల్సిన అవసరం నాకు రాలేదు. మాకు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇది చేస్తేనే అది చేస్తాం అని చెప్పలేదు' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment