Kamal Haasan birthday
-
Kamal Haasan Rare Photos: కమల్ హాసన్ మీరు ఎప్పుడు చూడని ఫోటోలు..
-
కమల్ హాసన్ బర్త్‌డే స్పషల్.. ఇండియన్-2 పోస్టర్ అదుర్స్
విశ్వనటుడు కమల్‌హాసన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘ఇండియన్ 2’. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 1996లో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీ యుడు’) సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా క్రేజీ అప్ డేట్‌తో ముందుకొచ్చింది చిత్రబృందం. ఈ మూవీలో కమల్ హాసన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. (చదవండి: తిరుపతిలో 'ఇండియన్-2' షూటింగ్) కమల్ తాజా పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ పోస్టర్లో కమల్ వృద్ధుడి గెటప్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇటీవలే తిరుపతిలో కొన్ని కీలకమైన సీన్లు కూడా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్‌సింత్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. To the one who’s versatility is beyond comparison, wishing the legend of Indian cinema a very happy birthday from team #Indian2#Ulaganayagan @ikamalhaasan #HBDKamalHaasan pic.twitter.com/rlwxnJmRbd — Red Giant Movies (@RedGiantMovies_) November 7, 2022 -
విందా? విధ్వంసమా?
రుచికరమైన భోజనం తయారు చేస్తున్నారు కమల్‌హాసన్. ఓ భారీ విందుని ఏర్పాటు చేసినట్టున్నారు. అతిథులందరూ వచ్చే లోపల విస్తళ్లు సిద్ధం చేశారు. ఆహార పదార్థాలు ఉన్న గిన్నెలు కూడా. వాటితో పాటు కొన్ని కత్తులు, తుపాకులు కూడా. ఇంతకీ ఇది విందు భోజనమా? విధ్వంసం సృష్టించే ముందు విందు పెడతారా? అనేది సినిమాలో చూడాలి. ‘ఖైదీ, మాస్టర్’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. శనివారం కమల్‌హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘విక్రమ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజర్లో కమల్ రుచికరమైన విందు వండుతూనే, విలన్స్‌ను వేసేయడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా కనబడుతోంది. -
పుట్టినరోజు వేడుకలు ఎందుకు రద్దయ్యాయంటే?
సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ మంగళవారం 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే, ఆయన ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు. చెన్నైతోపాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతుండటంతో జన్మదిన వేడుకలను కమల్ రద్దు చేసుకున్నారు. వేడుకలకు బదులుగా చెన్నైకి 20 కిలోమీటర్ల దూరంలోని అవది ప్రాంతంలో తన అభిమానులు ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌ను ఆయన సందర్శించబోతున్నారు. అక్కడి నుంచి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ చెన్నైను సందర్శించి.. బాధితులతో గడపబోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు కమల్ హాసన్ గత కొన్నాళ్లుగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి.. ఓ మొబైల్ యాప్‌ను విడుదల చేయాలని కమల్ భావించారు. తాజా వర్షాల నేపథ్యంలో వేడుకలు రద్దుచేసుకున్న కమల్.. మొబైల్ యాప్ లాంచ్ మాత్రం యథావిధిగా నిర్వహించబోతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ యాప్ మొదటి అడుగు అని, తన సందేశాన్ని ఈ యాప్ ద్వారా ప్రజలకు అందించబోతున్నట్టు కమల్ చెప్తున్నారు. 'పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకోవడం నన్ను అభిమానించే వారికి నచ్చకపోవచ్చు. కానీ, రేపు కూడా ఒక మామూలు రోజు మాత్రమే. దానిని సంబరాలతో గడిపేకంటే.. మనం కోరుతున్న మార్పు దిశగా ఈ రోజును వినియోగించుకోవడం ఉత్తమం' అంటూ అభిమానులను ఉద్దేశించి కమల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు తన అభిమాన సంఘాన్ని దశాబ్దం కిందటే వెల్ఫేర్ అసోసియేషన్‌గా కమల్ మార్చిన సంగతి తెలిసిందే. -
యాక్షన్ షురూ
సాక్షి,చెన్నై: రాజకీయ అరంగేట్రానికి తొలి అడుగుగా సినీ నటుడు కమల్ హాసన్ మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నారు. అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నామని కమల్ వెల్లడించారు.తన రాజకీయ ప్రస్థానానికి మొబైల్ యాప్ నాంది పలుకుతుందని అన్నారు. అభిమానులు తన వెన్నంటి నిలుస్తారనే నమ్మకం తనకుందని..గతంలో తాను చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సహకరించినట్టే రాజకీయ ప్రయాణంలోనూ ఉదారంగా నిధులిస్తారని కమల్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఆర్థిక లావాదేవీలన్నింటికీ మొబైల్ యాప్ కేంద్రంగా ఉంటుందని చెప్పారు.తాను స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచనని, అక్కడ మూలుగుతున్న ధనాన్ని వెనక్కిరప్పిస్తానని మంగళవారం 63వ బర్త్‌డే జరుపుకోనున్న కమల్ తెలిపారు. రాజకీయాలపై తాను తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని, సినిమా పాత్రకు సంసిద్ధమయ్యేందుకే తాను మూడు నెలల సమయం తీసుకుంటానని చెప్పారు. హిందూ తీవ్రవాదంపై ఇటీవల కమల్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. తాను బెదిరింపులకు భయపడనని దీనిపై మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనపై జాతి వ్యతిరేక ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తాను జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని, దేశంలో నెలకొన్న అతివాదంపైనే తాను మాట్లాడానని, ఉగ్రవాదానికి..అతివాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. -
‘తెర మీదకు చెన్నై పోరంబోకు’
నవంబరు ఏడున కాదు. ఐదో తేదీన బర్త్‌డే వేడుకలకు విశ్వనాయకుడు కమల్‌హాసన్ సిద్ధం అయ్యారు. చెన్నై శివారులోని కేలంబాక్కం వేదికగా ఐదో తేదీన వేడుకలకు అభిమానలోకం భారీ ఏర్పాట్లలో నిమగ్నం అయింది. ఈ వేడుకకు దక్షిణాది రాష్ట్రాల్లోని ముఖ్య అభిమానుల్ని మాత్రం ఆహ్వానించనున్నారు. పేదలకు సంక్షేమ పథకాల పంపిణీ సాగనుంది. ఇందులో కమల్ ప్రసంగం ఎలా ఉంటుందో అని ఎదురు చూపులు పెరిగాయి. సాక్షి, చెన్నై : ఏడో తేదీన కమల్ హాసన్ జన్మదినం. అయితే, ఐదో తేదీన వేడుకలు నిర్వహించేందుకు తాజాగా ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లోక నాయకుడు కమల్ ట్విట్టర్ విమర్శలు, ఆరోపణల పర్వం నుంచి శనివారం ప్రజల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. శనివారం కుశస్థలి నదీ తీరంలో సాగిన తన పర్యటన గురించి కొన్ని అంశాలను ట్వీట్లో వివరించిన కమల్, ఆ నదీ తీరం అన్యాక్రాంతానికి తగ్గ ఆధారాలు తన వద్ద ఉన్నట్టు ప్రకటించారు. గతంలో షూటింగ్ నిమిత్తం ఆ నదిలోకి తాను దూకిన క్షణాల్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు అక్కడున్న పరిస్థితిని వివరించారు. ఉత్తర చెన్నైని పరిరక్షించుకుందామన్న నినాదానికి బలం చేకూర్చే రీతిలో కమల్ ఓవైపు పిలుపునిస్తే, మరోవైపు ఆయన పుట్టిన రోజు వేడుకలు ముందుగానే నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్ల మీద అభిమాన వర్గాలు దృష్టి పెట్టడం గమనార్హం. కీలక ప్రకటన చేస్తారా? కమల్ జన్మదినం రోజైన ఏడో తేదీన రాజకీయంగా ప్రకటన వెలువడవచ్చని తొలుత ప్రచారం సాగింది. అయితే, అభిమాన సంక్షేమం నినాదంతో ముందుకు సాగబోతున్నట్టుగా ప్రకటన వెలువడింది. అయినా, రాజకీయ ప్రవేశాన్ని ధ్రువీకరించే విధంగా కీలక ప్రకటనను కమల్ చేయవచ్చన్న ఎదురుచూపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఏడో తేదీన కాదు, ఐదో తేదీనే బర్త్‌డే వేడుకలకు కమల్ నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలతో పాటు, ముఖ్య అభిమానులతో సమాలోచన సమావేశానికి చర్యలు తీసుకోవడంతో ఏడో తేదీన రాజకీయ అరంగ్రేటం ప్రకటన వెలువడే అవకాశాలు ఉండొచ్చన్న చర్చ ఊపందుకుంది. ఈ వేడుకలకు వేదికగా ఓఎంఆర్ రోడ్డులోని కేలంబాక్కంలో ఉన్న చెట్టినాడు విద్యా సంస్థల ఆడిటోరియంను ఎంపికచేశారు. సాయంత్రం ఐదు గంటల నుంచి కేవలం మూడు గంటల పాటు వేడుక నిర్వహించేందుకు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉండటం గమనార్హం. సంక్షేమ పథకాల పంపిణీ, పేదరికంలో ఉన్న అభిమానులకు భరోసాతో పాటు, ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోని అభిమాన సంఘాల ముఖ్య నేతలతో ఈ సమావేశం నిమిత్తం ఆçహ్వానాలు పంపించేందుకు నిర్ణయించి ఉన్నారు. దీంతో కమల్ రాజకీయ ప్రవేశ ఎదురుచూపులు మరింతగా పెరిగి ఉన్నాయి. ఇక, అభిమాన లోకాన్ని ఏకం చేస్తూ, ఈ వేదిక నుంచి మొబైల్ యాప్‌ను కమల్ విడుదల చేయనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. చెన్నై పోరంబోకు ఇక, కుశస్థలి నదీ తీరంలోని ఆక్రమణలను ఎత్తిచూపుతూ చెన్నై పోరంబోకు అన్న పాటను తెర మీదకు తెచ్చే పనిలో కమల్ అభిమాన లోకం నిమగ్నం అయింది. ఇందులో భాగంగా కమల్‌తో కలిసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన నిత్యానంద్ జయరామన్ ఈ పాటను రాశారు. థర్మల్ విద్యుత్ కేంద్రం, అక్కడి నుంచి వెలువడే బూడిద, ఎన్నూర్ హార్బర్, కుశస్థలి తీరంలో ఆక్రమణాల గురించి వివరిస్తూ రాసిన ఈ పాటను కర్ణాటక సంగీత గాయకుడు టీఎం కృష్ణన్ పాడుతారు. కబీర్ వాసుకి సంగీతాన్ని అందిస్తారు. గ్రామీణ , జానపదం, కర్ణాటక సంగీత మేళవింపుతో ఈ పాట వీనుల విందుగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నం అయ్యారు. -
అభిమానులకు కమల్ విన్నపం
ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్ 63వ ఏట అడుగుపెట్టారు. సోమవారం కమల్ 62వ పుట్టినరోజు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న కారణంగా కమల్ పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా చేసుకోవడం లేదు. అలాగే అభిమానులు కూడా తన జన్మదిన వేడుకలను నిర్వహించవద్దంటూ కోరారు. కమల్ ముద్దుల తనయ, నటి శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా తండ్రికి విషెస్ చెప్పింది. హ్యాపీ బర్త్ డే టు మై డార్లింగ్ డాడీ అంటూ కమల్‌తో ఉన్న ఫొటోను శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నటి గౌతమితో సుదీర్ఘకాలం సహజీవనం చేసిన కమల్ ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. కమల్, తాను ఇకమీదట కలసి ఉండటం లేదని గౌతమి ప్రకటించింది. గాయం నుంచి కోలుకుంటున్న కమల్ వచ్చే జనవరి నుంచి శభాష్ నాయుడు సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రత్యేక పాత్రలో శృతి హాసన్ నటిస్తున్నారు.