అభిమానులకు కమల్‌ విన్నపం | Shruti Haasan wishes father Kamal Haasan with this adorable picture | Sakshi
Sakshi News home page

అభిమానులకు కమల్‌ విన్నపం

Published Mon, Nov 7 2016 2:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

అభిమానులకు కమల్‌ విన్నపం

అభిమానులకు కమల్‌ విన్నపం

ప్రఖ్యాత నటుడు కమల్‌ హాసన్‌ 63వ ఏట అడుగుపెట్టారు. సోమవారం కమల్ 62వ పుట్టినరోజు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న కారణంగా కమల్ పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా చేసుకోవడం లేదు. అలాగే అభిమానులు కూడా తన జన్మదిన వేడుకలను నిర్వహించవద్దంటూ కోరారు.

కమల్‌ ముద్దుల తనయ, నటి శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా తండ్రికి విషెస్ చెప్పింది. హ్యాపీ బర్త్ డే టు మై డార్లింగ్‌ డాడీ అంటూ కమల్తో ఉన్న ఫొటోను శృతి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.

నటి గౌతమితో సుదీర్ఘకాలం సహజీవనం చేసిన కమల్ ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. కమల్, తాను ఇకమీదట కలసి ఉండటం లేదని గౌతమి ప్రకటించింది. గాయం నుంచి కోలుకుంటున్న కమల్‌ వచ్చే జనవరి నుంచి శభాష్ నాయుడు సినిమా షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రత్యేక పాత్రలో శృతి హాసన్ నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement