
తమిళసినిమా: ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థించడం తన తొందరపాటు, తప్పేనంటూ నటుడు కమల్‌హాసన్ ప్రజలను క్షమాపణలు కోరారు. మోదీ కూడా మొండిపట్టు పట్టకుండా తన తప్పును ఒప్పుకోవాలని ఆయన అన్నారు. పాత రూ.500, రూ.1,000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గత నవంబర్ 8 రాత్రి మోదీ ప్రకటన చేయడం తెలిసిందే.
ఆనంద వికటన్ అనే తమిళ వారపత్రికలో కమల్ తాజాగా ఓ వ్యాసం రాస్తూ ‘తొందరపాటుతో అప్పట్లో నోట్లరద్దును సమర్థించాను. ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న నా మిత్రులు కూడా అప్పుడే నన్ను తప్పుబట్టారు. తప్పులు ఒప్పుకోవడం, సరిదిద్దుకోవడం గొప్ప నేతల లక్షణాలు. మోదీ తన తప్పును ఒప్పుకుంటారేమో వేచిచూద్దాం’ అని పేర్కొన్నారు.