![Congress in Kerala apologises to Christians after facing flak on social media](/styles/webp/s3/article_images/2024/06/18/pope-modi.jpg.webp?itok=hb2n75wt)
క్రైస్తవులకు క్షమాపణ చెప్పిన కేరళ కాంగ్రెస్
తిరువనంతపురం: పోప్–మోదీ భేటీపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. పోప్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచి్చంది. జీ7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్‌లో చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
మోదీ–పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్.. దానికి ‘‘చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కింది’’ అని క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుపై బీజేపీతోపాటు ఇతర పారీ్టలు విమర్శలు గుప్పించాయి. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించిన కేరళ కాంగ్రెస్, క్రైస్తవులకు క్షమాపణలు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment