kerala congress
-
ఎన్నికల్లో సంస్థల సహకారం ఎంతున్నా అది తప్పనిసరి
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 ద్వారా అందించిన రాయితీలు దేశంలోని మొత్తం ప్రజల సొమ్మని కేరళ కాంగ్రెస్ తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలని పేర్కొంది. ఇటీవల ఓలా వంటి ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు అందిస్తున్న సేవలపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. దాంతో కేరళ కాంగ్రెస్ స్పందించింది. ఈమేరకు తన ఎక్స్ ఖాతాలో కేంద్రమంత్రి నితిన్గడ్కరీను ట్యాగ్ చేస్తూ కొన్ని విషయాలు పంచుకుంది.‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అయ్యే ఖర్చు భారత ప్రజలందరిది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాల పెంపునకు ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 పథకాల ద్వారా రాయితీలిచ్చింది. మే 2023 కంటే ముందు విక్రయించిన ఓలా ఎస్1 ప్రో మోడల్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ట్యాక్స్‌తో సహా రూ.1.16 లక్షలు రాయితీ అందించాయి. ఒక స్కూటర్‌కు ఇది భారీ రాయితీ. వినియోగదారులు, వారి భద్రత, సర్వీసును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అందించిన రాయితీలు ఏమేరకు ప్రయోజనం కలిగించాయో ప్రభుత్వం తెలుసుకోవడం చాలాముఖ్యం’ అని తెలిపింది.ఇదీ చదవండి: కస్టమర్ల నుంచి 10 వేల ఫిర్యాదులు‘మన దేశాన్ని బ్రాండ్ ఇమేజ్ సమస్య వెంటాడుతోంది. చైనా చౌకైన, తక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తులు తయారీ చేస్తుందనే బ్రాండ్ ఇమేజ్ నుంచి బయటపడేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కొన్ని భారతీయ కంపెనీలు ఎలాంటి రెగ్యులేటర్ పరిశీలన లేకుండా కస్టమర్ భద్రతను విస్మరించి తక్కువ నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. దాంతో దేశంలోని ఇతర బ్రాండ్లపై ప్రభావం పడుతోంది. అందువల్ల ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న నాణ్యమైన వాహనాలను ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంలో ‘చైనా బ్రాండ్’ ఇమేజ్‌నే మూటగట్టుకునే ప్రమాదముంది. కాబట్టి వాహనాల తయారీ, సర్వీసు అందించడంలో ప్రభుత్వం రెగ్యులేటర్‌గా ఉండాలని కోరుతున్నాం. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వానికి కంపెనీల సహకారం ఎంత ముఖ్యమైనదైనా సరే..నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోని సంస్థలు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి’ అని కేరళ కాంగ్రెస్ పేర్కొంది.Dear @nitin_gadkari,The reported quality issues with @OlaElectric or any other Electric Vehicle company for that matter is not between the company and their customers. It concerns each and every tax payer of this country.We've been giving huge subsidies to these companies… pic.twitter.com/rbCbkTHOhL— Congress Kerala (@INCKerala) October 7, 2024ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం సాగింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు, ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్ ముందు పోగైన వాహనాల ఫొటోను షేర్ చేస్తూ కమ్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టడంతో వాగ్వాదం ప్రారంభమైంది. కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కమ్రా పెట్టిన పోస్టుకు ‘ఇది పెయిడ్ పోస్టు’ అని అగర్వాల్ బదులివ్వడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. -
పోప్‌ను అవమానించడం మా ఉద్దేశం కాదు
తిరువనంతపురం: పోప్–మోదీ భేటీపై సోషల్ మీడియాలో చేసిన కామెంట్ పట్ల కేరళ కాంగ్రెస్ క్రైస్తవ సమాజానికి క్షమాపణలు చెప్పింది. పోప్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదని స్పష్టత ఇచి్చంది. జీ7 సదస్సులో పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ భేటీపై కేరళ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా అకౌంట్లో చేసిన పోస్టు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మోదీ–పోప్ ఫోటోను పోస్టు చేసిన కేరళ కాంగ్రెస్.. దానికి ‘‘చివరకు దేవున్ని కలిసే అవకాశం పోప్‌కు దక్కింది’’ అని క్యాప్షన్ రాసింది. ఆ పోస్టుపై బీజేపీతోపాటు ఇతర పారీ్టలు విమర్శలు గుప్పించాయి. దీంతో తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆ పోస్టును తొలగించిన కేరళ కాంగ్రెస్, క్రైస్తవులకు క్షమాపణలు చెప్పింది. -
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది!
ఆయనకు మనం ఎక్కువ పబ్లిసిటీ ఇస్తున్నామేమోనని అనిపిస్తోంది! -
కాంగ్రెస్ విషాదయోగం
‘అదృష్టం అందలమెక్కిస్తానంటే... బుద్ధి బురదలోకి లాగింద’ని సామెత. కేరళలో కాంగ్రెస్ పరిస్థితి అలాగేవుంది. అది ముఠా పోరుతో సతమతమవుతోంది. మరో 25 రోజుల్లో... అంటే వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో వున్న పార్టీ వరసగా రెండోసారి గెలిచిన ఆనవాయితీ లేదు గనుక... ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రజా తంత్ర కూటమి (యూడీఎఫ్)కి అవకాశం వుండొచ్చని కొందరు చెబుతున్నారు. మరోపక్క అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) వరసగా రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలంటున్నాయి. ఎవరి అంచనాలెలావున్నా ఎన్నికల సమరాంగణానికి వెళ్లే పార్టీకి విజయసాధనే ప్రధాన లక్ష్యంగా వుంటుంది. కానీ అదేం ప్రారబ్ధమో...ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆ కర్తవ్యాన్ని విడనాడి, తనకలవాటైన అంతర్గత పోరుతో సతమతమవుతోంది. సారధ్యం వహించాల్సిన పార్టీయే ఈ దుస్థితిలో పడటం చూసి యూడీఎఫ్‌లోని ఇతర పార్టీలు సహజంగానే నీరుగారుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎవరినో ఒకరిని నియమించమని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నిరుడు సెప్టెంబర్‌లో కోరిన 23మంది సీనియర్ నేతల అభీష్టం ఇంకా నెరవేరలేదు. వీలు కుదిరినప్పుడల్లా వారిని అవమానించటానికీ, పక్కకు నెట్టేయటానికీ పార్టీ అధిష్టానం చేయని ప్రయత్నమంటూ లేదు. వీరంతా సోనియాగాంధీకి వీర విధేయులు. అధినేత మెప్పు పొందటానికి వీరిలో ఎవరికెవరూ తీసిపోరు. కానీ నానాటికీ పార్టీ ప్రాభవం అడుగంటుతుంటే...సమీప భవి ష్యత్తులో అది జవసత్వాలు పొందే అవకాశాలు కనబడకపోవటంతో బెంబేలెత్తి ఆ లేఖ రాశారు. ఎని మిది నెలలు కావస్తున్నా వారికి జవాబూ లేదు సరిగదా... వారి పదవులు వరసబెట్టి ఊడబెరకటం మాత్రం రివాజైంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయద’టారు. కేరళ పీసీసీలో జరుగుతున్నది అదే. ఈ అంతర్గత పోరుతో విసిగిన సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి ఓ దణ్ణం పెట్టి నిష్క్రమించారు. ఆయన చిన్న స్థాయి నాయకుడేమీ కాదు. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన వ్యక్తి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, సీనియర్ నేత రాహుల్ గాంధీలకు సన్నిహితుడు. కానీ చాకోను సైతం ఆ 23మంది నేతల ఖాతాలో వేశారు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిందంటున్నారు. కేరళలో పార్టీ రెండు వర్గాలుగా చీలి పదవుల కోసం కీచులాడుకుంటుండగా, సరిచేయాల్సిన పార్టీ నిర్లిప్తంగా వున్నదంటున్నారు. ఫలితంగా కేరళలో ఓటమి ఖాయమని వాపోతున్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్ ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ 91 నుంచి 95 వరకూ స్థానాలు తీసుకునే అవకాశంవుంది. మిత్రపక్షాల్లో ప్రధానమైన ఐయూఎంఎల్‌కు 27, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)కు 10 ఇవ్వాల్సివుంటుంది. అవి తమ వాటాను పెంచమని అడిగే ఛాన్సుంది కూడా. ఇవిగాక చిన్నా చితకా పార్టీలు మరో అయిదు వున్నాయి. ఇంతక్రితం యూడీఎఫ్‌లో భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్(మణి) వర్గం ఈసారి ఎల్డీఎఫ్ వైపు వెళ్లిపోయింది. గతంలో ఆ పార్టీకి రివాజుగా ఇచ్చే 11 స్థానాల్లో ఎవరెవరికి ఏయే స్థానాలివ్వాలో తేల్చాలి. ఇవన్నీ ఇంకా కొలిక్కి రాలేదు. భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గినా, తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ వుంటే...ఎల్డీఎఫ్ మాత్రం చురుగ్గా కదులుతోంది. ప్రధాన భాగస్వామ్య పక్షం సీపీఎం తమకు కేటాయించిన 85 స్థానాల్లో 83 స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించి, చాలా ముందుగానే ప్రచారం మొదలుపెట్టింది. ఫ్రంట్‌లోని ఇతర పార్టీలను కూడా తొందరపెడుతోంది. ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ఘనంగా ప్రకటించిన బీజేపీ... అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయలేదు. ఈ రెండు ప్రధాన కూటముల జాబితాలూ ఖరారై, అటునుంచి ఎవరైనా వస్తారేమో చూశాకే ఆ పని చేసే అవకాశం వుంది. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకూ కేరళకు ప్రత్యేక స్థానముంది. స్వస్థలంలో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంనుంచే ఎంపీగా నెగ్గారు. కనీసం అందుకోసమైనా ఈసారి కేరళలో అధికారం దక్కకపోతే పరువుపోతుందని ఆయన భావిస్తున్నట్టు లేరు. అవినీతి ఆరోపణలపై తొలి రెండు సంవత్సరాల్లోనే ముగ్గురు ఎల్డీఎఫ్ మంత్రులు తప్పుకోవాల్సిరావటం, లాకప్ మరణాలు, బంగారం స్మగ్లింగ్ స్కాం వంటి ఆరోపణల విషయంలో నిలదీసి ఎల్డీఎఫ్ను ఇరకాటంలో పెట్టాలని యూడీఎఫ్ చూస్తోంది. శబరిమల వివాదం విషయంలో సీపీఎం తన మౌలిక సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించిందని యూడీఎఫ్కానీ, బీజేపీకానీ ఎటూ విమర్శించే అవకాశం లేదు. అలా చేస్తే అది ఎల్డీఎఫ్కు మేలు చేయటమే అవుతుంది. వీటి సంగతలావుంచి సీట్ల ఖరారు కోసం యూడీఎఫ్ ప్రధాన నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ప్రదక్షిణాలు చేస్తున్నారు. బీజేపీ సైతం తన ప్రచార భేరి మోగించిన తరుణంలో చాకో రాజీనామా వార్త యూడీఎఫ్‌ను కుంగదీసిందనటంలో సందేహం లేదు. అధికారంలోకి రావటానికి అంతో ఇంతో అవకాశముందనుకున్నచోట పార్టీ మసకబారుతుంటే తలకలవాటైన రీతిలో కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్న వైనం ఆ పార్టీ నిర్వా్యపకత్వానికీ, నిస్తేజానికీ అద్దం పడుతోంది. -
కేరళ కాంగ్రెస్ చీఫ్ పరిస్థితి విషమం!
కొచ్చి: కేరళ కాంగ్రెస్(ఎం) అధ్యక్షుడు కేఎం మణి ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 86 ఏళ్ల మణికి కొచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చెస్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే మణి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాగా, మణికి మెరగైన వైద్యం అందిస్తున్నామని ఆస్పత్రి హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. ఆయన 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కొట్టాయం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన కేరళ కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. కానీ అనారోగ్యం కారణంగా ఆయన ప్రచారానికి దురంగా ఉన్నారు. -
పదేపదే.. కాలు తాకాడు: ఎంపీ భార్య
సాక్షి, తిరువనంతపురం : కేరళ కాంగ్రెస్ చీఫ్ కేఎం మణి కోడలు, ఎంపీ జోస్ మణి భార్య నిషా జోస్ ఓ పుస్తకంలో రాసుకున్న జ్ఞాపకాలు కలకలం రేపుతున్నాయి. ‘రాజకీయ నేత భార్యగా తన జీవితానుభవాలు’ పేరిట ఆమె రాసిన పుస్తకం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో తాను రైలులో ప్రయాణిస్తుండగా చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఘటనను ఆమె ప్రస్తావించడంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. 2012లో తనతో కలిసి ప్రయాణించిన ఓ రాజకీయ నేత లక్ష్మణరేఖ దాటారంటూ పేరు వెల్లడించకుండా జోస్ మణి పేర్కొనడం దుమారం రేపుతోంది. ఆ వ్యక్తి తన కాలును ఉద్దేశపూర్వకంగా పలుమార్లు తాకారని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కు ఫిర్యాదు చేసినా ఆయన తనకు సాయపడలేదన్నారు. నిందితుడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే తాను ఇబ్బందుల్లో పడతానని అతను భయపడినట్టు చెప్పారని ఆరోపించారు. నిందితుడు మిత్ర పక్షానికి చెందిన నేత కావడంతో సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోమని రైల్వే అధికారి తనకు ఉచిత సలహా ఇచ్చారని ఆమె రాసుకొచ్చారు. తాను రైల్వే స్టేషన్లో ఉండగా, సదరు వ్యక్తి తాను ఓ రాజకీయ నేత కుమారుడినని పరిచయం చేసుకున్నారని, రైలు ఎక్కిన తర్వాత కూడా అతను తనతో మాట్లాడేందుకు ప్రయత్నించాడని అప్పటి ఘటనను ఆమె ప్రస్తావించారు.మరోవైపు ఆమె చేసిన వ్యాఖ్యలపై కేరళ ఎంఎల్ఏ పీసీ జార్జ్ కుమారుడు షోన్ జార్జ్ స్పందించారు. తనను వేధించిన వ్యక్తి పేరును ఆమె వెల్లడించాలని కోరారు. పుస్తకాన్ని ప్రమోట్ చేసుకునేందుకే జోస్ మణి ఈ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ఘటన జరిగినప్పుడు నిషా, జార్జ్‌లు ఇద్దరూ కాంగ్రెస్ కేరళ రాష్ట్ర శాఖలో పనిచేస్తున్నారు. -
ఎట్టకేలకు నోరువిప్పిన శశిథరూర్
తిరువనంతపురం : కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎట్టకేలకు నోరువిప్పారు. భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలపై ఆయన తన ఫేస్బుక్ ద్వారా స్పందించారు. బీజేపీలో చేరికపై ఇప్పటికే తనను చాలామంది అడిగారని ఆయన అన్నారు. అవన్నీ రూమర్లేనని శశిథరూర్ తోసిపుచ్చారు. ఊహాజనితమైన వాటిపై తాను స్పందించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇప్పటికి లెక్కలేనన్నిసార్లు తనను అడిగారని, దానికి కూడా తాను పలుమార్లు సమాధానమిచ్చానన్నారు. గతంలోనూ చాలాసార్లు శశిథరూర్ బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ మాట్లాడుతూ... నలుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, వారిలో శశిథరూర్ ఒకరని అన్నారు. కేరళ కాంగ్రెస్ నేతల చేరికపై కేపీపీసీ ప్రెసిడెంట్ ఎంఎం హసన్ వద్ద నివేదికలు కూడా ఉన్నాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను హసన్ తోసిపుచ్చారు. నలుగురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నట్లు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎస్ఎం కృష్ణ, జాఫర్ షరీఫ్లా బీజేపీలో చేరే నాయకులెవరూ కేరళలో లేరని అన్నారు. ఈ నెల 12న జరిగే మలప్పురం ఉప ఎన్నిక ప్రచారం శశిథరూర్ పాల్గొంటారని తెలిపారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై శశిథరూర్‌ను అడగగా, అదంతా బీజేపీ చేస్తున్న ప్రచారమేనని ఆయన కొట్టిపారేసినట్లు చెప్పారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ను స్వాగతించడంతో కాంగ్రెస్ పార్టీ గతంలో శశిథరూర్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. శశిథరూర్ వ్యాఖ్యలు కేరళలోని కాంగ్రెస్‌కు నష్టం కల్గించేవిధంగా ఉన్నాయంటూ ఆ రాష్ట్ర పార్టీ శ్రేణులు అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశాయి. ఏఐసీసీ క్రమశిక్షణా ఉల్లంఘన కింద భావించిన అధిష్టానం ఆయన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా తొలగించింది. -
వీధికుక్కలు పెరిగాయని.. దారుణం!
జిల్లాలో వీధికుక్కల బెడద ఎక్కువైపోయిందంటూ కేరళ కాంగ్రెస్ (ఎం) యువజన నాయకులు చేసిన పని దారుణాతి దారుణంగా ఉంది. ఐదు కుక్కలను చంపి, వాటి కాళ్లను ఓ కర్రకు కట్టి తలకిందులుగా వాటి కళేబరాలను వేలాడదీసుకుంటూ వీధుల్లో ప్రదర్శన చేశారు. వీధుల్లో కుక్కలు బాగా పెరిగిపోయాయని, అవి కరుస్తున్న ఘటనలు కూడా ఎక్కువవుతున్నాయని వాళ్లు అన్నారు. ప్రదర్శన తర్వాత.. వాళ్లు ఆ కళేబరాలను మునిసిపాలిటీ కార్యాలయం వెలుపల గుట్టగా పారేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. కుక్కలను చంపింది తామేనని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుక్కల బెడద గురించి పట్టించుకోకపోతే.. భవిష్యత్తులో కూడా మరిన్ని కుక్కలను చంపుతామని నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహించిన సాజీ మంజకదంబిల్ చెప్పారు. కేరళలో వీధికకుక్కలను చట్టవిరుద్ధంగా చంపబోమని ఇంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్ తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. అయితే.. కుక్కలను చంపడంపై ఇంతవరకు పోలీసు కేసు మాత్రం ఏదీ నమోదు కాలేదు. కేరళలో ఇటీవలి కాలంలో వీధికుక్కల మీద దాడులు పెరిగిపోయాయి. దాంతో ఇది కాస్తా రాజకీయ అంశంగా కూడా మారిపోయింది. గత నెలలో కుక్కల దాడితో 65 ఏళ్ల వృద్ధురాలు తిరువనంతపురంలో మరణించారు. -
మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?
ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేసి వచ్చి.. కేంద్రమంత్రిగా ఉండి, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా, కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే శశి థరూర్.. త్వరలోనే పార్టీ మారబోతున్నారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన నుంచి ప్రేమలేఖలు వెళ్తున్నాయని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వ్యవహారాన్ని శశి థరూర్ కూడా పరోక్షంగా బలపరిచారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తననెప్పుడూ బయటివాడిగానే చూశారని ఆయన వాపోతున్నారు. తాను నరేంద్రమోదీని ప్రశంసించానని అంటున్నవాళ్లు తన వ్యాఖ్యలను అర్థం చేసుకోలేదని, అందువల్ల వాళ్ల విమర్శలపై స్పందించేది లేదని థరూర్ అంటున్నారు. రాజకీయాల్లోకి తాను చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే బహుశా వీటిలో సరిగా ఇమడలేకపోతున్నానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీజయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అక్కడున్న తొమ్మిది మంది ప్రముఖుల్లో థరూర్ కూడా ఒకరు కావడం కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆహ్వానం వచ్చినందుకు తానెంతో గౌరవంగా ఫీలవుతున్నానని ఆయన అనడాన్ని కేరళ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆయన ప్రధానికి ప్రేమలేఖలు రాస్తున్నారని కూడా కేరళ కాంగ్రెస్ పత్రిక ఆరోపించింది. టీవీలలో వచ్చినవాళ్లందరి వద్దా తన నెంబరు ఉందని, వాళ్లు కావాలంటే తనకు నేరుగా ఫోన్ చేయచ్చు గానీ, అలా చేయకుండా బహిరంగ విమర్శలకు దిగారని, దాన్ని బట్టే వాళ్ల కోరిక ఏంటో తెలిసిపోతోందని థరూర్ వ్యాఖ్యానించారు.