‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీ | Narendra Modi apologize for collapse Chhatrapati Shivaji statue | Sakshi
Sakshi News home page

‘వాళ్లకి కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు’: ప్రధాని మోదీ

Published Fri, Aug 30 2024 3:47 PM | Last Updated on Fri, Aug 30 2024 6:43 PM

Narendra Modi apologize for collapse Chhatrapati Shivaji statue

ముంబై : చత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. శిరస్సు వంచి క్షమాపణలు చెప్పారు.

మహరాష్ట్రలో రూ.76వేల కోట్లతో నిర్మించనున్న వాడ్‌వాన్‌ పోర్ట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ కూలిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ‘మనమంతా ఛత్రపతి శివాజీని దేవుడిలా కొలుస్తాం. కొందరు వ్యక్తులు దేశ భక్తులను అవమానిస్తున్నారు. వీర సావర్కర్‌ను కూడా ఇష్టారీతిగా తిట్టిపోశారు. దేశభక్తులను అవమానించినవారు క్షమాపణలు చెప్పాల్సిందే. సమరయోధులను గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా వారికి లేదు. కానీ క్షమాపణలు చెప్పకుండా కోర్టుకు వెళ్లి పోరాటం చేసేందుకు సిద్ధమయ్యారని’ ధ్వజమెత్తారు.

నా కొత్త ప్రయాణం ప్రారంభమైంది అప్పుడే 
2013లో బీజేపీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ప్రకటన అనంతరం నేను చేసిన మొదటి పని రాయ్‌గఢ్‌లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధిని భక్తుడిలా  సందర్శించా. అప్పటి నుంచే నా కొత్త ప్రయాణం ప్రారంభమైందని’ మోదీ అన్నారు. ముందు ఒక భక్తుడిగా కూర్చుని కొత్త ప్రయాణం ప్రారంభించడం” అని మోదీ పాల్ఘర్‌లో అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement