ముంబై : ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిపోవడంపై మహరాష్ట్రలో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఇందులో భాగంగా హుతాత్మ చౌక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు విపక్ష నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
విగ్రహం కూలిపోవడంపై ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అయితే మోదీ క్షమాపణలపై మహరాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
మోదీ క్షమాపణల్లో మీరు అహంకారాన్ని చూశారా? ప్రధాని ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు. ఎనిమిది నెలల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం కూలిపోయినందుకా? లేదంటే విగ్రహం నిర్మాణంలో అవినీతి చోటు చేసుకున్నందుకా? అని ప్రశ్నలు కురిపించారు. శివాజీ మహారాజ్‌ను అవమానించిన శక్తులను ఓడించడానికి ఎంవీఏ క్యాడర్ కలిసి పనిచేయాలి అని పిలుపునిచ్చారు.
ఇక శివాజీ విగ్రహం కూలిపోవడంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని వ్యాఖ్యానించిన సీఎం ఏక్‌నాథ్ షిండే వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మేం రాజకీయాలు చేస్తున్నామని ప్రభుత్వం చేస్తుంది. మేం రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర కీర్తి కోసం పోరాడుతున్నాం. మహాయుతి ప్రభుత్వానికి గెట్ అవుట్ చెప్పడానికి మేము గేట్‌వే ఆఫ్ ఇండియాకు వచ్చాము’అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment