మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజ్జు భారతదేశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయులు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం డిమాండ్ చేశారు. భారత్-మాల్దీవుల దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపరుకునే క్రమంలో అధ్యక్షుడు మొయిజ్జు ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలన్నారు. అధ్యక్షుడు మొయిజ్జు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
చైనా అనుకూలమైన వ్యక్తిగా పేరున్న మొయిజ్జు ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు సంబంధిత తీర్మాణంపై సంతకాల సేకరణకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జుమ్‌హూరీ పార్టీ చీఫ్ గసుయిమ్ ఇబ్రహీం భారత్‌కు క్షమాపణ చెప్పాలని చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అదేవిధంగా అక్కడి ప్రజలు కూడా సోషల్ మీడియాలో తమ అధ్యక్షుడు భారతీయులకు క్షమాపణలు చెప్పాలని ప్రచారం జరుగుతోంది.
చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్‌లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగింది. అయితే నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది. దీంతో ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఎంపీలు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించిన విషయం తెలిసిందే. పార్లమెంట్‌లో మొత్తం 80 మంది సభ్యులకుగాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment