ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి
కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ
బాపట్ల : పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలగపూడిలో నిర్వహించిన ధర్నాకు శుక్రవారం పనబాక ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముందస్తు కసరత్తు లేకుండా నోట్లు రద్దుచేయడం వల్ల దేశ వ్యాప్తంగా ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆన్‌లైన్‌లో నగదు నిర్వహణ చేపట్టాలని చెప్పే నాయకులు కొన్నిచోట్ల కమ్యూనికేషన్లు సరిగా లేవనే విషయంపై ప్రస్తావించకపోవటం విచారకరమన్నారు. నోట్లు రద్దుపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని పేర్కొన్నారు. పనబాక లక్ష్మీతోపాటు బాపట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇన్‌చార్జీ చేజర్ల నారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు లేళ్ళ వెంకటప్పయ్య, మద్దిబోయిన తాతయ్య, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, కోటా వెంకటేశ్వరెడ్డి, మాసా చంద్రశేఖర్ ఉన్నారు.