
టాలీవుడ్ హీరో నాగార్జున ప్రస్తుతం రజినీకాంత్ కూలీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే వైజాగ్‌లో కూలీ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. నాగార్జున యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఇటీవల నెట్టింట లీక్ అయ్యాయి.
అయితే నాగార్జున ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున బిగ్‌బాస్ షో సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీలోని సాంగ్‌కు స్టెప్పులతో అదరగొట్టారు. ఆయుధ పూజ పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
(ఇది చదవండి: మీ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుంటా.. అభిమానులపై ఎన్టీఆర్)
కాగా.. ఎన్టీఆర్- కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ మూవీ యంగ్ టైగర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ద్వారానే టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు.
Nagarjuna performance for Ayudhapooja song ❤🔥#Nagarjuna #NTR @tarak9999 pic.twitter.com/5xuXrHS3Yr
— Devara NTR (@DevaraTsunamiOn) October 5, 2024