
జపాన్ వెళ్లారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవర’. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాలోని తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’ 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా (తండ్రి పాత్ర దేవర, కొడుకు పాత్ర వర) నటించి, ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారు.
ఇక ఈ నెల 28న ‘దేవర: పార్ట్ 1’ సినిమా జపాన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ టూర్‌లో భాగంగా ఎన్టీఆర్ జపాన్ వెళ్లారు. ఈ ప్రమోషనల్ టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను హీరోగా చేస్తున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్‌లో ఎన్టీఆర్ పాల్గొంటారని సమాచారం.
అలాగే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యాక ‘దేవర 2’ సినిమా షూట్‌లో పాల్గొంటారని, ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment