దేవర.. నీ రాక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్‌తో మహిళా అభిమాని | Japan Women Meet Jr NTR | Sakshi
Sakshi News home page

దేవర.. నీ రాక కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు.. ఎన్టీఆర్‌తో మహిళా అభిమాని

Sep 27 2024 3:56 PM | Updated on Sep 27 2024 4:29 PM

Japan Women Meet Jr NTR

దేవర విడుదల సందర్భంగా బియాండ్‌ ఫెస్ట్‌లో పాల్గొనేందుకు  జూ ఎన్టీఆర్ అమెరికాలోని‌ లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ ఫెస్టివల్‌లో ప్రదర్శితం అయిన తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ రికార్డ్‌ నెలకొల్పింది.  సినిమా ప్రదర్శన అనంతరం అక్కడికొచ్చిన అభిమానులతో ఆయన ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఒక మహిళా అభిమానితో మాట్లాడుతూ ఆమెకు తారక్‌ ఒక మాటిచ్చాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఖ్యాతి పాన్‌ ఇండియా రేంజ్‌కు చేరుకోవండంతో పాటు ఖండాంతరాలు దాటింది. ముఖ్యంగా తారక్‌కు జపాన్‌లో భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే, బియాండ్‌ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌ పాల్గొంటున్న విషయం తెలుసుకున్న ఓ మహిళ.. టోక్యో నుంచి లాస్‌ ఏంజెల్స్‌కు చేరుకుంది. అతికష్టం మీద ఆమె తారక్‌ను కలుసుకుని మాట్లాడింది. ఎన్టీఆర్‌ను చూసేందుకు ఎంతోమంది అభిమానులు జపాన్‌లో ఎదురుచూస్తున్నారని ఆమె తెలిపింది. ఆపై తమ దేశానికి రావాలని తారక్‌ను ఆహ్వానించింది. ఆమె మాటలతో ఎన్టీఆర్‌ చాలా ఆనందించారు. ఈ క్రమంలో జపాన్‌కు తప్పకుండా వస్తానని, అభిమానులతో కలిసి దేవర చూస్తానంటూ తారక్‌ మాటిచ్చారు.

ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవర. సెప్టెంబర్‌ 27న విడుదలైన ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా మెప్పిస్తే..  సైఫ్‌ అలీఖాన్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement