హెచ్‌ఎం కొట్టడంతో విద్యార్థి వీపుపై వాతలు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: స్టడీ అవర్‌కు రాలేదనే కోపం తో ఒక ప్రధానో పాధ్యా యుడు నలుగురు విద్యార్థులను కట్టెతో చితక బాదారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గిరిజన ఆశ్రమ బాలుర హాస్టల్‌లో బుధవారం ఉదయం 8.30 గంటలకు స్టడీ అవర్ ఏర్పాటు చేశారు. కానీ తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, నవీన్, దీపక్, పవన్ నాయక్ రాలేదు. ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు వారిని పిలిపించారు.
స్టడీ అవర్‌కు ఎందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెత్తంతో విద్యార్థుల వీపులు, చేతులపై కొట్టడంతో వాతలు తేలాయి. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారితో పాటు గిరిజన సంఘం నేత రమేష్ తదితరులు హాస్టల్‌కు చేరుకుని ప్రధానోపాధ్యాయుడితో గొడవకు దిగారు. దీనిపై హెచ్‌ఎం బుచ్చిరాములును వివరణ కోరగా విద్యార్థులు స్టడీ అవర్‌కు రాలేదని, క్రమశిక్షణతో ఉండాలనే కొట్టాను తప్ప మరో ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment