
ఎస్ఐ కాలు విరగ్గొట్టిన మహిళా నేత
మీరట్: ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీ మహిళా నేత స్థానిక పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించింది. స్వల్ప విషయానికే ఆగ్రహంతో రెచ్చిపోయింది. తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దౌర్జన్యం చేసింది. అడ్డొచ్చిన పోలీస్ అధికారిపై దాడి చేసి అతని కాలు విరగ్గొట్టింది.
స్నేహితులతో కలిసి కారులో మద్యం సేవిస్తూ వెళుతున్న ఎస్పీ నేత సంగీత రాహుల్ కొడుకును చెక్పోస్ట్ దగ్గర అడ్డుకోవడమే ఆ పోలీసులు చేసిన నేరం. నా కొడుకునే అడ్డుకుంటారా..అంటూ సదరు మహిళ నేత ఆగ్రహంతో ఊగిపోయింది. కొంతమంది అనుచరులను వెంటేసుకొని పోలీస్ స్టేషన్పై దాడికి దిగడమే కాకుండా అడ్డొచ్చిన ఎస్ఐ సర్వేష్ పై దాడి చేసింది. దీంతో అతని కాలు విరిగింది.