చిల్లర అడిగితే.. చితక్కొట్టాడు..! | Conductor Beats the Young man iN Wanaparthy | Sakshi
Sakshi News home page

చిల్లర అడిగితే.. చితక్కొట్టాడు..!

Published Thu, Jun 14 2018 8:42 PM | Last Updated on Tue, Aug 21 2018 6:08 PM

Conductor Beats the Young man iN Wanaparthy - Sakshi

సాక్షి, వనపర్తి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బస్‌ కండక్టర్‌ రౌడీలా ప్రవర్తించాడు. ఈ ఘటన వనపర్తి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఓ యువకుడు తనకు రావాల్సిన రూ.3 చిల్లరను కండక్టర్‌ను అడిగాడు. కోపంతో ఆ కండక్టర్‌ రెచ్చిపోయి ఆ యువకుడ్ని బస్టాండ్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో వేసి చితకబాదాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే తమదైన శైలిలో పోక తప్పదని వారు హెచ్చరించారు. 

ఆ సమయంలో అక్కడ ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సంబంధిత అధికారులు ఎవరూ కూడా అడ్డుచెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement