ఐజ్వాల్: మిజోరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ రాతి క్వారీ కుప్పకూలి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఐజ్వాల్ జిల్లాలో జరిగిన క్యారీ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరికొంత మంది క్యారీలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
#Mizoram: 2 killed, many feared dead after stone quarry collapses in #Aizawl
Two individuals were killed after a stone quarry collapsed in Aizawl’s Melthum and Hlimen border on May 28 around 6 am after #CycloneRemal wreaked havoc across Mizoram, as per latest reports.… pic.twitter.com/rCr7cExMGX— India Today NE (@IndiaTodayNE) May 28, 2024
క్యారీలో చిక్కుకున్నవారిని రెస్య్కూ చేసి బయటకు తీసుకురావటానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడే ప్రాంతం సెర్చ్ ఆపరేషన్‌కు ప్రతికూలంగా మారిందని వెల్లడించారు.
10 Dead, Several Feared Trapped As Stone Quarry Collapses In Mizoram https://t.co/8B5FGdvLz6
— Priyanka Krishnadas (@pri3107das) May 28, 2024
మరోవైపు భారీ వర్షం కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులుకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. అదే విధంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో హైవేలు, కీలక రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. హుంతూర్ వద్ద జాతీయ రహదారి 6పై కొండచరియలు విరిగిపడటంతో ఐజ్వాల్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. ఆదివారం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుపాన్ బిభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment