న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పేద వర్గాల, దళిత, బీసీల సాధికారత కోసం కుల గణన చేపట్టాలని పేర్కొంది. కుల గణన కోసం అధికార బీజేపీపై ఒత్తిడి పెంచుతామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించారు. కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే కుల గణన నిర్వహిస్తామని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది.
ఈ మేరకు సీడబ్ల్యూసీ భేటీలో తీర్మానం చేశారు. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం కలి్పస్తామని వెల్లడించింది. కుల గణనకు మద్దతు ఇస్తూ సీడబ్ల్యూసీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ అన్నా రు. కుల గణన అనేది ఇండియాకు ఎక్స్–రే అని అభివరి్ణంచారు. బిహార్‌లో నిర్వహించిన కుల గణనను సీడబ్ల్యూసీ స్వాగతించింది. త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు చర్చించారు.
ప్రభావవంతమైన వ్యూహం కావాలి: ఖర్గే
ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలంటే ప్రభావవంతమైన వ్యూహం అవసరమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా, క్రమశిక్షణతో పనిచేయాలని పార్టీ కార్యకర్తలకు సీడబ్ల్యూసీ భేటీలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అసలైన లబి్ధదారులకు అందాలంటే కేంద్ర ప్రభుత్వం కుల గణన ప్రారంభించాలని అన్నారు. కుల గణనకు తాను వంద శాతం మద్దతు ఇస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ సోనియా గాంధీ చెప్పారు. దానికోసం పోరాడుదామని సూచించారు. కులాల వారీగా జనాభా లెక్కలకు తమ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment