
న్యూఢిల్లీ: ఏఐసీసీ కార్యాలయంలో సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కొనసాగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలపై సోనియా సీరియస్ అయ్యారు. 'కాంగ్రెస్ పార్టీకి నేనే పూర్తి స్థాయి అధ్యక్షురాలిని. పార్టీ అంతర్గత విషయాలు మీడియా ద్వారా కాదు నేరుగా నాతో మాట్లాడండి. అన్ని అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎలాంటి అంశాలైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాను.
కాంగ్రెస్ పునరుజ్జీవనమే అంతా కోరుకుంటున్నారు. అందుకోసం నేతల మధ్య, ఐక్యత, క్రమశిక్షణ అవసరం. పార్టీ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. కరోనా వల్లే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమైందని' సోనియా గాంధీ అన్నారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లఖింపూర్ ఖేరి ఘటన, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు, పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలపై సీడబ్ల్యూసీలో ముఖ్యంగా చర్చిస్తున్నారు.
చదవండి: (నేడు అమ్మ సమాధి వద్దకు శశికళ.. కీలక ప్రకటన చేసే అవకాశం..!)