
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ నేతలు విన్యాసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. నేతల ఫిరాయింపులు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేవలం రెండు నెలల వ్యవధిలోనే రెండుసార్లు బీజేపీలో చేరారు. ఇదంతా కేవలం టికెట్ కోసమే.
గురుదాస్‌పూర్ జిల్లాలోని శ్రీహరగోబింద్‌పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బల్వీందర్‌సింగ్ లడ్డీ ప్రతిపక్ష బీజేపీలో మరోసారి చేరారు. శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆయనను కాషాయ దళంలోకి ఆహ్వానించారు. లడ్డీ గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఆరు రోజుల తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. శ్రీహరగోబింద్‌పూర్ స్థానం నుంచి ఆయనకు టిక్కెట్ ఇవ్వబోమని కాంగ్రెస్ తేల్చిచెప్పడంతో తాజాగా మళ్లీ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ నుంచి ఆయనకు టికెట్ ఇస్తారో లేదో ఇంకా నిర్ధారణ కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment